ASSEMBLY ELECTIONS: మొబైల్ నెంబర్‌తోనే ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకోండిలా..
మొబైల్ ఫోన్ ద్వారానే తమ ఓటు హక్కు గురించి తెలుసుకోవచ్చు. ఓటు గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం తాజాగా ఈ వెసలుబాటు కల్పించింది.
ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. కాగా, ఇప్పటికీ కొందరికి తమ ఓట్ల గురించిన సమాచారం తెలీదు. తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేరు ఉందో, లేదో తెలియదు.
KCR SKETCH : కేసీఆర్ భలే స్కెచ్ ..! వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్లాన్
అలాంటివాళ్లు మొబైల్ ఫోన్ ద్వారానే తమ ఓటు హక్కు గురించి తెలుసుకోవచ్చు. ఓటు గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం తాజాగా ఈ వెసలుబాటు కల్పించింది. ఎవరైనా తమ రిజిష్టర్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటు గురించి తెలుసుకునే వీలుంది. https://https://electoralsearch.eci.gov.in/ ద్వారా లాగిన్ అయ్యి, తమ ఓటు ఉందా.. లేదా.. ఏ నియోజకవర్గంలోని, ఏ పోల్ బూతులో ఓటు హక్కు ఉందో తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఈ లింక్‌పై క్లిక్ చేస్తే.. హోమ్ పేజ్‌లో డ్యాష్ బోర్డ్ కనిపిస్తుంది. దీన్ని ఎలక్టోరియల్ సెర్చ్ అని పిలుస్తారు. ఇక్కడ మొబైల్ నెంబర్ సెర్చ్ పక్కనే, కుడివైపున కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. సెలెక్ట్ యువర్ స్టేట్ అని కనిపిస్తుంది.
అప్పుడు మీకు కావాల్సిన స్టేట్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని, కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి, క్యాప్చా కూడా ఎంటర్ చేసి, ఓకే చేస్తే వెంటనే వినియోగదారులకు సంబంధించిన ఓటర్ ఐడీ కార్డ్ నెంబర్, పేరు, వయస్సు, తండ్రి పేరు, జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం తదితర వివరాలు కనిపిస్తాయి.