AP Assembly Elections : ఏపీలో భారీగా పెరిగిన పోలింగ్‌… ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..

ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపించిన ఏపీ రాజకీయంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్‌.. ఈవీఎంల్లో నిక్షిప్తమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2024 | 06:00 PMLast Updated on: May 14, 2024 | 6:00 PM

Huge Increase In Polling In Ap Who Benefits Who Loses

ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపించిన ఏపీ రాజకీయంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్‌.. ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడంతో.. ఏపీ ఓటర్లు కొత్త రికార్డులు క్రియేట్‌ చేసారు. ఎండ, వాన.. పగలు రాత్రి లెక్క చేయకుండా.. పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. అర్థరాత్రి దాటినా కొన్ని చోట్ల పోలింగ్‌ జరిగింది. దీంతో పోలింగ్ పర్సంటేజీలో ఏపీ ఓటర్లు కొత్త రికార్డులు క్రియేట్ చేశారు.

పోలింగ్ 80శాతం దాటడం.. మహిళలు, వృద్ధులు, యువకులు భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో.. నేతలు, పార్టీలు కన్ఫ్యూజన్‌లో పడిపోయాయ్. భారీగా పెరిగిన పోలింగ్ పర్సంటేజీతో లాభం ఎవరికి.. నష్టం ఎవరికి.. యుద్ధంలో గెలుపెవరిది.. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారు.. ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయ్. పెరిగిన పోలింగ్ పర్సంటేజీ తమకే అనుకూలం అని వైసీపీ చెప్తుంటే.. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే.. జనాలు ఈ లెవల్‌లో ఓటు వేశారని.. కూటమి నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. నిజానికి పోలింగ్‌ శాతం పెరిగితే.. అధికార పార్టీకే నష్టం. చరిత్ర దాటొచ్చి చూసినా, పాత లెక్కలు తీసినా.. ఇదే అర్థం అవుతుంది కూడా ! గతంలో చాలా ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే కనిపించాయ్. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే.. ఎక్కువమంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు గతంలో ! అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. లెక్కలు చూస్తే.. 2014లో ఏపీలో పోలింగ్ 77.96 శాతం నమోదు కాగా.. 2019 ఎన్నికల్లో పోలింగ్ 79.64 శాతం నమోదైంది.

ఈసారి 80శాతం దాటింది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో.. వైసీపీపై వ్యతిరేకతతోనే ఓటర్లు పోటెత్తారని.. గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్నది మెజారిటీ వర్గాలు చెప్తున్న మాట. ఐతే వైసీపీ వర్గాల వాదన మరోలా ఉంది. కూటమి అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఆగిపోతాయని.. ఓటర్లు క్యూ కట్టారని.. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయిందని అంటున్నారు. పైగా అందరు వర్సెస్ ఒక్కడు అని వైసీపీ చేసిన ప్రచారం.. జనాలను కదిలించిందని.. జగన్‌కు అండగా నిలిచేలా చేసిందన్నది ఫ్యాన్‌ పార్టీ నేతలు అంటున్న మాట. ఏమైనా ఒక్కటి మాత్రం క్లియర్‌.. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఓటర్లు ఉప్పెనలా తరలి వచ్చిన సందర్భాలు చరిత్రలో లేవు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటే.. జనం వెల్లువలా తరలివచ్చి ఓటు వేస్తారనడానికి చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయ్. మరి అదే రిపీట్ అవుతుందా.. ఓటర్లు కొత్త హిస్టరీ సృష్టిస్తారా చూడాలి మరి.