ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్ వస్తే..! ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో..?
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో సీన్ మారడం.. కాంగ్రెస్ పుంజుకోవడం చూస్తున్నాం. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మెజార్టీ జనం ఎటు ఓట్లు వేస్తారు? ఏ పార్టీకి అధికారం కట్టబెడతారు అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది.
ASSEMBLY ELECTIONS: తెలంగాణలో BRS, Congress, BJP ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మూడు పార్టీలు దూకుడుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన BRSకి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత తప్పకపోవచ్చని తెలుస్తోంది. దాంతో ఆ ఓట్లను కాంగ్రెస్, బీజేపీలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో సీన్ మారడం.. కాంగ్రెస్ పుంజుకోవడం చూస్తున్నాం. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మెజార్టీ జనం ఎటు ఓట్లు వేస్తారు? ఏ పార్టీకి అధికారం కట్టబెడతారు అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ఎన్నిలకపై పోల్ సర్వేలు నిర్వహించాయి అనేక జాతీయ మీడియా సంస్థలు. వీటిల్లో చాలా వరకూ BRS, కాంగ్రెస్‌కు ఇంచుమించు 50శాతం సీట్లు వస్తాయని చెబుతున్నాయి. కానీ 119 ఓట్లు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 60 సీట్లు కావాలి. ఒకవేళ BRSకు 60 సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి..? అంటే 53 లేదా 54 స్థానాలు గెలుచుకున్నా.. పక్కాగా BRS మూడోసారి అధికారం చేపడుతుంది. ఎందుకంటే MIM ఎలాగూ మద్దతు ఇస్తుంది. మజ్లిస్‌కి పాతబస్తీ నుంచి 6 లేదా 7 సీట్లు గెలుపు ఖాయం కాబట్టి BRS ప్రభుత్వానికి ఢోకా లేదు.
Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ
ఒకవేళ BRSకు 53 కాకుండా అంతకంటే తక్కువ వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు BRS సర్కార్ ఏర్పాటుకు జాతీయ పార్టీల మద్దతు కోరాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. బీజేపీకి తెలంగాణలో కొన్నయినా అసెంబ్లీ స్థానాలు వస్తే ఆ పార్టీతోనే గులాబీ పార్టీ జత కట్టే ఛాన్సుంది. కేంద్రంలో NDA సర్కార్‌కి కొన్ని బిల్లుల విషయంలో గతంలో మద్దతు ఇచ్చింది BRS. అందువల్ల కలిస్తే BJPతోనే. అప్పుడు మజ్లిస్‌ను పక్కనబెట్టాలి. లేదంటే, రెండు పార్టీల సపోర్ట్ తీసుకోవాలి. ఇక కాంగ్రెస్‌తో మాత్రం BRS కలిసే అవకాశమే ఉండదు. PCC చీఫ్ రేవంత్ రెడ్డి అందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. BRS అవినీతిపై పోరాటమంటూ క్యాంపెయిన్ చేసి, ఆ పార్టీతో అంటకాగే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోదు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు కావాలి కాబట్టి, BRSతో పొత్తుకు BJP సిద్ధం అవడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది.
బీజేపీ ఎలాగూ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ప్రస్తుత ఎన్నికల వాతావరణం చూస్తే అర్థమవుతుంది. సో.. హంగ్ వస్తే బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసే పరిస్థితుల్లో అయితే ఉండదనే అనుకోవాలి. హంగ్ అసెంబ్లీ వస్తే కాంగ్రెస్ వైఖరి ఏంటి..? కాంగ్రెస్ ఒకవేళ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకొని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఏవో కొన్ని సీట్లు తక్కువైతే ఏం చేస్తుంది అంటే.. కాంగ్రెస్ అప్పుడు రిక్వెస్ట్ చేయాల్సింది MIMనే. గతంలో స్నేహం ఉంది కాబట్టి మళ్ళోసారి జత కలుద్దామని అడగొచ్చు. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి సపోర్ట్ చేసే MIM కూడా కాంగ్రెస్‌కు సహకరించే అవకాశాలు ఉన్నయ్. MIM మద్దతు ఇవ్వకపోయినా, ఇచ్చినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడితే అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ముందు MLAలను కాపాడుకోవడమే కష్టం.
Bharat Atta: కేంద్ర కొత్త పథకం భారత్ ఆటా.. తక్కువ ధరకే గోధుమ పిండి.. కేజీ ధర ఎంతంటే..
గతంలో రెండు సార్లు చూశాం. అవసరం లేకున్నా కాంగ్రెస్ MLAలు BRS ప్రభుత్వంలో చేరిపోయారు. ఇప్పుడు వాళ్ళ అవసరం పడితే మాత్రం BRS ఏ మాత్రం ఛాన్స్ వదులుకోదు. ఎంత అడిగినా ఇచ్చి పార్టీలో చేర్చుకుంటుందన్న రూమర్స్ ఉన్నాయి. తెలంగాణలో హంగ్ రాకూడదు. పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లీడర్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే హంగ్ ఏర్పడితే దారుణంగా నష్టపోయేది కాంగ్రెస్ మాత్రమే. తమ ఎమ్మెల్యేలను గోడ దూకకుండా పోలింగ్ అయిన వెంటనే కర్ణాటక క్యాంపులకు తరలించాల్సి ఉంటుందేమో. హంగ్ అంటే కాంగ్రెస్‌కే అసలు సిసలు పరీక్ష ఎదురయ్యే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి.