పెళ్లైన వారానికే భర్త కశ్మీర్ ఎటాక్‌లో మృతి, కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో
తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్‌తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది.

తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్‌తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా హనీమూన్‌కు కశ్మీర్ వెళ్లిన ఓ మహిళ అక్కడే ఉగ్రదాడిలో తన భర్తను పోగొట్టుకుంది. కళ్లముందే భర్తను లాక్కెళ్లి టెర్రరిస్టులు చంపేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె కూర్చున్న తీరు ప్రతీ ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఈశాన్య ద్వివేది. చనిపోయిన వ్యక్తి పేరు శుభం ద్వివేది. జస్ట్ 2 నెలల క్రితమే వీళ్లకు పెళ్లైంది.
భర్తతో కలిసి హనీమూన్‌కోసం కశ్మీర్‌కు వచ్చింది ఈశాన్య. పెహల్గాంలో ఉదయాన్ని హార్స్ రైడింగ్ చేసేందుకు వచ్చారు వీళ్లిద్దరూ. రైడింగ్ పూర్తయ్యాక అక్కడే కూర్చుని టిఫిన్ తింటున్న సమయంలో కొందరు ఆర్మీ సోల్జర్స్ అక్కడికి వచ్చారు. సోల్జర్సే కదా అని అంతా ధైర్యంగా ఉన్నారు. కానీ వాళ్లు వచ్చిన శుభం పేరు అడిగి అతను హిందువు అని తెలియగానే ఒక్కక్షణం ఆలోచించకుండా కాల్చేశారు. అప్పుడే అందరికీ అర్థమైంది వాళ్లు ఆర్మీజవాన్లు కూదు పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లు అని. వదిలేయండి అని కాళ్లా వేళ్లా పడ్డా వినలేదు ఆ దుర్మార్గులు. ఈశాన్య చూస్తూ ఉండగానే ఆమె భర్తను కళ్ల ముందే కాల్చేశారు.
వెంటనే ప్రాణభయంతో పరుగులు తీశారు అక్కడున్న టూరిస్టులు. కానీ వీళ్లంతా ఉన్న పెహల్గాం ప్రాంతం మెయిన్ రోడ్డు నుంచి చాలా లోపలికి ఉంటుంది. అందుకే ఇక్కడ ఎటాక్ జరిగిన విషయం కూడా దాదాపు 30 నిమిషాల తరువాత బయటికి వచ్చింది. కానీ ఈ గ్యాప్‌లోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 28 మంది టూరిస్టులను చంపేశారు టెర్రరిస్టులు. వారం క్రితమే పెళ్లి చేసుకున్న ఓ నేవీ ఆఫీసర్ కూడా ఈ ఎటాక్‌లో చనిపోయాడు. విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. నెల్లూరుకు చెందిన మధుసూదన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు.