బ్రేకింగ్: పవన్ కు షాక్ ఇచ్చిన కోర్ట్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరిలో నెలలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరిలో నెలలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిల్నుణ విచారణకు స్వీకరించిన కోర్టు… ఆయనకు నోటీసులు జారీ చేసింది.
తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు పదార్థాలు కలిసినట్టు పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన నేపధ్యంలో సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై. రేణుక నోటీసులు జారీ చేసారు. వచ్చే నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కోర్టు సమన్లు జారీ చేసింది.