HYDERABAD VOTERS: మీరు మారరా..? ఓటెయ్యడానికి వీళ్ళకి బద్దకం.. హాలిడే ఎంజాయ్ చేసిన సిటీ జనం

సెలెబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు, ఉన్నతాధికారులు.. ఎన్నికల కమిషన్.. ఎంత మంది మొత్తుకున్నా యూత్ మాత్రం ఇల్లు దాటి బయటకు రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి కూడా 35శాతానికి మించి పోలింగ్ జరగలేదు. 5 గంటల తర్వాత క్యూలైన్లలోఉన్న వారిని కూడా కలుపుకుంటే.. ఇంకో 5 శాతం పెరగవచ్చేమో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 30, 2023 | 05:30 PMLast Updated on: Nov 30, 2023 | 5:30 PM

Hyderabad Voters Are Not Interested To Vote In Telangana Assembly Elections

HYDERABAD VOTERS: అనుకున్నట్టే అయింది.. ఎప్పటిలాగే మనోళ్ళు ముసుగేశారు.. ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటూ తెలంగాణ పోలింగ్ డేని ఎంజాయ్ చేశారు. కొందరేమో ఊళ్ళకి చెక్కేశారు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.. వ్యవస్థలో అక్కడ సమస్య ఉంది.. ఇక్కడ ప్రాబ్లెమ్ ఉంది.. ఆ పార్టీ విధానం బాగోలేదు.. ఈ పార్టీ సిస్టమ్ చెండాలంగా ఉంది.. అంటూ సోషల్ మీడియాలో ఉబుసుపోక కామెంట్స్ పెట్టే గ్రేటర్ హైదరాబాద్ సిటీ జనం.. ఈసారి కూడా పోలింగ్ బూత్ కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు.

సెలెబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు, ఉన్నతాధికారులు.. ఎన్నికల కమిషన్.. ఎంత మంది మొత్తుకున్నా యూత్ మాత్రం ఇల్లు దాటి బయటకు రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి కూడా 35శాతానికి మించి పోలింగ్ జరగలేదు. 5 గంటల తర్వాత క్యూలైన్లలోఉన్న వారిని కూడా కలుపుకుంటే.. ఇంకో 5 శాతం పెరగవచ్చేమో. తెలంగాణ రాష్ట్రంలోని 119నియోజకవర్గాల్లో ఉదయం ఏడింటి నుంచే పోలింగ్ మొదలైంది. చలికాలం కావడంతో పట్టణ ఓటర్లు సూర్యుడు కొంచెం కనిపించాక పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం 7 గంటల కంటే ముందే క్యూలైన్లలో నిల్చున్నారు. గత ఎన్నికల్లో చాలా మంది ఓట్లు గల్లంతు అవడం.. ఓటర్ కార్డు ఉన్నా కేంద్రానికి వెళితే అక్కడ లిస్ట్ లో లేకపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ పుణ్యమాని.. అలాంటి కంప్లియింట్స్ ఎక్కడా రాలేదు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో జనం పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలైనల్లో కూడా నిలబడి మరీ ఓట్లేశారు.

ASSEMBLY ELECTIONS: పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.. పరస్పర దాడులు.. డబ్బులు ఇవ్వలేదని ఓటు వేయని గ్రామస్తులు

గ్రామీణుల్లో చాలా మంది ఓటు వేయకపోతే తాము చనిపోయిన వారిగా ఫీలవుతారు. హైదరాబాద్ సిటీలో కూడా సినీ, రాజకీయ ప్రముఖులు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండతో పాటు ఖైరతాబాద్, కూకట్ పల్లి ఏరియాలో జనం భారీగానే ఓట్లేశారు. సినీ నటీ నటులు, దర్శకులు, నిర్మాతలైతే.. ఎక్కడెక్కడో ఉన్న తమ షూటింగ్స్ ఆపుకొని మరీ వచ్చి క్యూలైల్లో నిలబడ్డారు. అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ప్రతి ఒక్క నటుడూ తమ కుటుంబాలతో సహా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూత్‌ని ఓట్లేయాలంటూ మీడియా ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారు. కొందరు నటులు ట్వీట్స్, ఫేస్ బుక్స్ ఇతర సోషల్ మీడియా ద్వారా ఓటు విలువ ఏంటో చెప్పారు. కానీ హైదరాబాద్ సిటీ పరిధిలో ఉదయం పోలింగ్ మొదలైన 3 గంటల్లో 6 శాతానికి మించి జనం ఓట్లేయలేదు. సరే మధ్యాహ్నం భోజనం చేశాక తీరిగ్గా వచ్చి ఓట్లు వేస్తారని అనుకున్నారు. కానీ మధ్యాహ్నానికి 20శాతానికి మించలేదు. ఈ 20శాతంలో కూడా బస్తీ ఓటర్లు, పోలింగ్ డే నాడు కూడా సెలవు ఇవ్వకపోవడంతో డ్యూటీలకు వెళ్ళేందుకు పొద్దున్నే వచ్చి ఓట్లేసిన వాళ్ళే ఉన్నారు. పోలింగ్ డే నాడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఇచ్చింది.

NAGARJUNA SAGAR: నీళ్ళ గొడవ.. సాగర్ నీళ్ళు తిప్పేసుకున్న ఏపీ.. ఎన్నికల టైమ్‌లో తొందరెందుకు..?

కానీ సెలవు తీసుకున్న హైదరాబాద్ జనం ఇళ్ళల్లో ఉండి ఏం చేసినట్టు. ఐదేళ్ళపాటు మనల్ని పాలించేవాళ్ళని ఎన్నుకునే అద్భుత అవకాశం ప్రజాస్వామ్యయుతంగా మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఉయోగించుకోలేదు. ఓటు వేయమని ప్రతీసారి ఎన్నకల కమిషన్ ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయినా ఈసీనో, మీ ఫేవరేట్ సినీ నటుడు చెబితే కాదు.. నేను ఎందుకు ఓటు వేయలేదు.. అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి కదా.. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన కామెంట్స్ పెట్టడం కాదు.. ఓటు ద్వారా అభ్యర్థులకు బుద్ది చెప్పాలి కదా… ఒకే..మీకు ఏ రాజకీయ నాయకుడు ఇష్టం లేకపోతే.. EVMలో నోటా బటన్ ఉంది కదా.. గ్రామీణ జిల్లాల ఓటర్లు కూడా తమకు నచ్చని అభ్యర్థి బరిలో ఉంటే.. పెద్ద ఎత్తున నోటాకు ఓట్లేసిన సందర్భాలు తెలంగాణలో గత ఎన్నికల్లో జరిగాయి. మరి నోటాకి ఓట్లేసే ఓపిక కూడా సిటీ జనానికి లేకుండా పోయింది. ఓట్లేయని జనంలో ఐటే పీపులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది.