మణికొండ లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచారు. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. నెక్నాంపూర్ చెరువును కబ్జాదారులు కబ్జాలు చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అక్రమంగా వెలసిన నాలుగు విల్లాల నిర్మాణాలను కూల్చివేసారు. గతంలో కూల్చివేతలను రెవెన్యూ, జీహెచ్ఎంసి అధికారులతో పాటు హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేశారు. మూడుసార్లు కూల్చివేసినా యధావిధిగా అక్రమ నిర్మాణాలను చేపట్టడం మొదలుపెట్టారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ అదేశాల మేరకు నేడు కూల్చివేతలు మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు మొదలయ్యాయి.