ఏపీ హోం మంత్రి అనిత పి ఏ జగదీష్ ని తొలగించడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు అనిత పిఏను అవినీతి ఆరోపణలపై తీసేశారు అని అంటున్నారే తప్ప.... ఏ అవినీతి చేశాడు, ఎంత తిన్నాడు?..... తిన్న దాంట్లో ఎవరికి ఏమి ఇచ్చాడు.?.. అన్నది మాత్రం ఎవ్వరు క్లియర్ గా చెప్పడం లేదు. తన పిఏ నీ తానే తొలగించానని హోంమంత్రి అనిత కొత్త కథ చెబుతున్నారు. కానీ పిఏ జగదీష్ తొలగింపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచింది అనేది ఏపీ సెక్రటేరియట్లో వినిపిస్తున్న కథ. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి హోం మంత్రి అనిత పై ఏదో ఒక.... వివాదం... విమర్శ.. ఆరోపణ.. వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ మధ్యకాలంలో జరిగిన పోలీసుల బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని విమర్శ బహిరంగంగానే వినిపించింది. సహజంగా శాఖలో ఎస్ఐ ,.సిఐ.,డిఎస్పి సాయి బదిలీలన్నీ జిల్లాలోనే అయిపోతాయి. ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు శాఖలో బదిలీలు జరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం మొత్తం హోంమంత్రి కార్యాలయం నుంచి అన్ని బదిలీలు జరిగాయి. అంతేకాదు ఎస్సై కావలసిన చోటుకు బదిలీకి 10 లక్షలు, సీఐ ట్రాన్స్ఫర్ కు 25 లక్షలు, డి.ఎస్.పి బదిలీకి 50 లక్షల వరకు రేటు పలికినట్లు డిపార్ట్మెంట్లో టాక్. ఇదే విషయంపై ఏపీలో వామపక్ష పార్టీలన్నీ గోల గోల చేశాయి. బదిలీల పేరుతో వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎవరికి వెళ్లాయి? హోం మంత్రి కార్యాలయం మొత్తం బదిలీల్లో అంత సూక్ష్మంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. హోం మంత్రి అనిత పై జనసేన ఎమ్మెల్యేలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు కూడా చేశారు. పోలీస్ స్టేషన్లో తమను పట్టించుకోవడం లేదని, అంతా టిడిపి వాళ్ళ హవా మాత్రమే నడుస్తోందని ,పోలీసుల బదిలీల్లో ఎక్కడ జనసేన ఎమ్మెల్యేలకు మంత్రులకు ,అవకాశం ఇవ్వలేదని జే ఎస్ పి నేతలంతా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అనిత వ్యవహార శైలిపై అసహనంతో ఉన్న పవన్ కళ్యాణ్..... పోలీస్ బదిలీల్లో జరిగిన అవినీతిపై ప్రశ్నించకపోయినా.... అనితకు ఆ శాఖ పై పట్టు లేదని, అవసరమైతే తానే ఆ శాఖ నిర్వహిస్తానని డైరెక్ట్ గా సభ ముఖంగా చెప్పేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి, అనితకు మధ్య సయోధ్య కుదిరించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే అనిత పేషీ వ్యవహారాలపై మాత్రం సీఎం కార్యాలయం పూర్తిగా దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అనిత వ్యవహారాలపై ఘాటుగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనిత వ్యవహారాలన్నీ జగదీష్ షాడో హోమ్ మినిస్టర్ లాగా నడుపుతున్నాడని, నేరుగా అనిత పై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఇరకాటంలో లో పడే అవకాశం ఉంటుందని భావించారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికిప్పుడు హోంమంత్రి అనితనీ తొలగిస్తే అసలుకే మోసం రావచ్చని సిబిఎన్ఆలోచన. అందుకే తెలివిగా అనిత చుట్టూ ఉన్న వాళ్ళని కత్తిరించారు. ఆమె పిఏ జగదీష్ ను తీసి అవతలి పడేసారు అయితే అనిత చెప్పే కథ వేరే రకంగా ఉంది. హోం మంత్రి అనిత పిఏ జగదీష్ ను తొలగించినప్పటికీ.... అనిత కదలికలపై మాత్రం ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది. పీఏ తొలగింపుతోనే కథ అయిపోలేదు. కేవలం అనిత మాత్రమే కాదు మరికొందరు మంత్రుల పేరు కూడా మంత్రులకు బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర మంత్రి పేషీ సిబ్బంది, గుంటూరుకు చెందిన మరో మంత్రి పి ఏ, మంత్రి కందుల దుర్గేష్ పిఏ, ఇలా దాదాపు ఏడు శాఖల్లో పీఏలే మొత్తం చక్రం తిప్పుతున్నారని, మంత్రులే వాళ్ళని ముందు పెట్టి వ్యవహారాలు చక్కబెడుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటిలిజెంట్ సమాచారం అందింది. ఒకేసారి అందరిపై యాక్షన్ తీసుకుంటే తమకు తామే అల్లరి చేసుకున్నట్లు అవుతుందని.... ఒక్కొక్కరిపై కొరడా జరిపించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.[embed]https://www.youtube.com/watch?v=urQS2_17vuU[/embed]