Telangana elections : బీజేపీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ పేరు మారుస్తాం..
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీ జెండా తెలంగాణ గడ్డపై ఎగరవేయాలని.. దృఢ సంకల్పంతో బీజేపీ అగ్ర నాయకత్వం అంత తెలంగాణలో సూడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు అమిత్ షా, మోదీ, జేపీ నడ్డా.. మరో వైపు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్.. ఇలా అగ్ర నాయకులందరు తెలంగాణ గడ్డ పై కళ్లకు గజ్జలు కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అధిత్యనాథ్ పలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు నిన్న హైదరాబాద్ కు వచ్చిన యూపీ సీఎం యోగి అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీ జెండా తెలంగాణ గడ్డపై ఎగరవేయాలని.. దృఢ సంకల్పంతో బీజేపీ అగ్ర నాయకత్వం అంత తెలంగాణలో సూడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు అమిత్ షా, మోదీ, జేపీ నడ్డా.. మరో వైపు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్.. ఇలా అగ్ర నాయకులందరు తెలంగాణ గడ్డ పై కళ్లకు గజ్జలు కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అధిత్యనాథ్ పలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లలో రామరాజ్య స్థాపన విజయ సంకల్ప సభలతోపాటు హైదరాబాద్‌లోని సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్ షోలలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. ‘మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకొనేది లేదు’అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలన గురించి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 2017కు ముందు యూపీలోనూ అలానే ఉండేవని.. గూండాగిరీ, దాదాగిరీ, మాఫియా, కబ్జాలు కొనసాగేవి.. అయితే యూపీ ప్రజలు కుటుంబ పాలనకు తెరదించి బీజేపీకి పట్టం కట్టడంతో ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఎవరైనా గూండాగిరీ, మాఫియా నడిపిస్తే బుల్డోజర్లతో బుద్ది చెబుతున్నామని చెప్పుకోచ్చారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ఒక్క రోజూ కర్ఫ్యూ పెట్టలేదని వెల్లడించారు. అలాగే అభివృద్ధి, ఆదాయంలోనూ యూపీ ముందుకు దూసుకపోతుంది అని చెప్పారు. యూపీలో ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరో 4 లక్షలు కల్పించబోతున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు కోసం బీజేపీని గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా రక్షణ కల్పించి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ను భాగ్య నగరంగా మారుస్తాం..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీ సీఎం యోగి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చిందని.. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ మాత పేరుపై ఉన్న హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం జరుపుతాం..
మేము అధికారంలోకి వచ్చాక.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బలిగొన్న సంత్రపోరటల పురిటి గడ్డ అయిన తెలంగాణ ను నిజాం నుంచి విమూక్తి పొందిన రోజును.అనగా సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే రామమందిరం కట్టించేదా? కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేదా? అని ప్రశ్నించారు యోగి. తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎలాగైనా తెలంగాణలో రామ రాజ్యం స్థాపిద్దాం అని పిలుపునిచ్చారు