Top Story: ఇండియా ఈ ఒక్క పని చేస్తే పాకిస్థాన్ ఎడారిగా మారడం ఖాయం! యుద్ధాన్ని మించిన నష్టం ఇది…!
ఒక దెబ్బకు రెండు దెబ్బలు కొట్టి చూపిస్తాం. శతృవు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి మరీ చంపేస్తాం. పహల్గాం ఎటాక్ మీద ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఇది.

ఒక దెబ్బకు రెండు దెబ్బలు కొట్టి చూపిస్తాం. శతృవు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి మరీ చంపేస్తాం. పహల్గాం ఎటాక్ మీద ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఇది. చేయాల్సింది చేసి నక్క ఏడుపులు ఏడుస్తున్న పాకిస్థాన్‌కు నిజానికి ఈ ట్రీట్‌మెంట్ సరిపోదు. పాకిస్థాన్‌ను పూర్తిగా పతనం చేయాలి అంటే ఆ దేశానికి ప్రాణ నాడిగా ఉన్న సింధు నది నీళ్లను ఆపేయాలి. సింధు నది తిబెట్‌లోని మానస సరోవర్ సమీపంలోని సెంగే ఖబాబ్ నుంచి ఉద్భవిస్తాయి. ఇది కైలాస పర్వత శ్రేణి సమీపంలో ఉంది. అక్కడి నుంచి ఇది తిబెట్, జమ్మూ, కాశ్మీర్, లడాఖ్, పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి పంజాబ్, సింధ్ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. సింధు నది నీళ్లు పాకిస్తాన్‌కు వెళ్లకుండా భారత్ ఆపాలనుకుంటే, ఈ నీటిని జమ్మూ కాశ్మీర్, లడాఖ్ ప్రాంతాల్లో ఆపొచ్చు. ఎందుకంటే సింధు నది, దాని ప్రధాన ఉపనదులు జీలం, చినాబ్ ఈ ప్రాంతాల నుంచే ప్రవహిస్తాయి ఆ తర్వాతే పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తాయి.
సింధు నది పాకిస్తాన్‌కు జీవనాడి వంటిది. పాకిస్తాన్‌లో 65% భూభాగం సింధు పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ దేశంలో 90% పంటసాగు సింధు నీటిపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వరి, గోధుమ, చెరకు పంటల ఈ నీళ్లే ముఖ్యం. పాకిస్తాన్‌లోని పెద్ద ఆనకట్టలు సింధు, జీలం నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. పాకిస్తాన్‌లోని 21 కోట్ల పైగా జనాభాకు తాగునీరు, గృహావసరాలకు సింధు నది నుంచే నీళ్లు వెళ్తాయి. ఈ నదిని భారత్ ఆపేస్తే పాకిస్థాని ఎడారిగా మారడం ఖాయం. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఇది చావు దెబ్బ అవుతుంది. సింధు నది లడాఖ్‌లోని లేహ్, కార్గిల్ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ పెద్ద ఆనకట్టలు, రిజర్వాయర్‌లు నిర్మించడం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించవచ్చు. శ్రీనగర్ సమీపంలో జీలం నదిపై ఆనకట్టలు, బ్యారేజీలు నిర్మించడం ద్వారా అక్కడ కూడా నీటిని నియంత్రించవచ్చు. ఇప్పటికే ఉన్న వుల్లర్ బ్యారేజ్ వంటి నిర్మాణాలను ఉపయోగించి నీటి ప్రవాహాన్ని మళ్లించవచ్చు.
చినాబ్ నది జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్, డోడా ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ బాగ్లిహార్, సలాల్ వంటి జలవిద్యుత్ ప్రాజెక్టులను విస్తరించి, నీటిని నిల్వ చేయడం మళ్లించడం పాజిబుల్ అవుతుంది. భారత్ ఈ నీటిని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని సాగు భూములకు మళ్లించడానికి కాలువలు, రిజర్వాయర్‌లు నిర్మించవచ్చు. ఉదాహరణకు, రాజస్థాన్‌లోని ఇందిరా గాంధీ కాలువ వంటి వ్యవస్థలను విస్తరించి, సింధు నీటిని ఉపయోగించవచ్చు. జీలం, చినాబ్ నీటిని రావి, బియాస్, సట్లెజ్ నదులతో అనుసంధానం చేసే కాలువలు నిర్మించి ఈ నీటిని భారత్‌లోనే ఉపయోగించవచ్చు. కానీ సింధు నదీ జలాల ఒప్పందం ఉన్నందున, నీటిని ఆపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం అవుతుంది. ఇది పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను మరింత దిగజార్చవచ్చు మరియు అంతర్జాతీయ సంఘం నుంచి ఒత్తిడిని తెచ్చిపెట్టవచ్చు.
భారత్ అన్నిటికీ తెగించి ముందడుగు వేసినా పాకిస్థాన్ పీకేదేం లేదు. భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ సైనిక బలం తక్కువ. భారత్‌కు అధునాతన రక్షణ వ్యవస్థలు, భారీ ఆర్థిక నిధులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్నాయి. యుద్ధం ఖర్చులను భరించడం కష్టం, IMF రుణాలపై ఆధారపడి ఉంది. భారత్‌కు అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలతో బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు చైనా, కొన్ని గల్ఫ్ దేశాల మద్దతు ఉన్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఆ దేశాలు యుద్ధానికి దిగే పరిస్థితులు చాలా తక్కువ. ముఖ్యంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చిన కారణంగా పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఒంటరైపోయింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో పాకిస్థాన్ చాప్టర్ క్లోజ్ చేయడానికి మన పీఓకేను వెనక్కి తెచ్చుకోడానికి ఇంతమి మించిన మంచి టైం లేదు.