రష్యా తల్చుకుంటే ప్రపంచం అంతం, పుతిన్ సిద్ధం చేసిన ఆ సీక్రెట్ వెపన్ ఇదే
తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు నేను తుడుచుకోడానికి రెడీ.. కానీ నేనే పోతాను అనుకుంటే.. నువ్వూ పోతావ్. ఈ డైలాగ్ రష్యాకు ఎగ్జాట్‌గా సెట్ అవుతుంది.

తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు నేను తుడుచుకోడానికి రెడీ.. కానీ నేనే పోతాను అనుకుంటే.. నువ్వూ పోతావ్. ఈ డైలాగ్ రష్యాకు ఎగ్జాట్‌గా సెట్ అవుతుంది. ఎందుకంటే తాను అంతమయ్యే పొజిషన్‌లో ఉన్నప్పుడు ఒక నిమిషం ముందే శతృ దేశాలను అంతం చేయడానికి రష్యా సెట్ చేసి పెట్టుకున్న ప్లాన్ అలాంటిది. అందుకే చాలా దేశాలు రష్యాను టచ్ చేయడానికి భయపడుతుంటాయి. ఒక వేళ రష్యాను అంతం చేయాలి అని శతృ దేశాలు భావిస్తే.. ఒక రకంగా అది మొత్తం ప్రపంచానికే ప్రమాదం.
ఎందుకంటే రష్యా దగ్గర పెరీమీటర్ అనే న్యూక్లియర్ వెపన్ లాంచింగ్ సిస్టం ఉంది. దీన్ని యాక్టివేట్ చేయడానికి ఒక్కరు చాలు. ఒకవేళ శతృదేశం చేసిన దాడిలో రష్యా సైన్యం మొత్తం అంతమైనా.. ఈ వెపన్ లాంచ్ చేయడానికి ఒక్కరు చాలు. అంతే రష్యా దగ్గర ఉన్న అణ్వస్త్రాలు మొత్తం శతృదేశాల మీదకు దూసుకెళ్తాయి. పతనం అంచున రష్యా ఉన్నప్పుడు శతృ దేశాలను నాశనం చేసేందుకు సోవియన్ కాలంలో ఏర్పాటు చేసిన ప్రతీకార దాడి వ్యవస్థ ఇది. వినడానికే భయంకరంగా ఉన్న ఈ వ్యవస్థనను డెడ్‌హ్యాండ్ అంటారు. ఇలాంటి భారీ దాడులు చేయగల వ్యవస్థ రష్యా దగ్గర ఉంది కాబట్టే చాలా దేశాలు రష్యా జోలికి రావాలంటే వెనకడుగు వేస్తాయి.