AP Political : గెలుస్తుందని చెప్తే.. ఓటమి ఖాయం.. సీఓటర్ రికార్డు చూసి టీడీపీ టెన్షన్..
ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ( AP Elections) జరగబోతున్నాయ్. దీంతో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena).. బీజేపీని కూడా చేర్చుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే.. వైసీపీ (YCP) మాత్రం సింగిల్‌గా ఫైట్‌కు సిద్ధం అవుతోంది. నియోజకవర్గ ఇంచార్జిలను మార్చుతూ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు..
ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ( AP Elections) జరగబోతున్నాయ్. దీంతో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena).. బీజేపీని కూడా చేర్చుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే.. వైసీపీ (YCP) మాత్రం సింగిల్‌గా ఫైట్‌కు సిద్ధం అవుతోంది. నియోజకవర్గ ఇంచార్జిలను మార్చుతూ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న చర్చలతో.. ఏపీ పాలిటిక్స్ (AP Political) హీట్ మీద కనిపిస్తున్నాయ్. ఇక అటు ఏపీలో రాజకీయ పరిణామాలపై అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయ్. ఇండియాటుడే – సీఓటర్ కూడా కూడా సర్వే చేసింది. టీడీపీకి 17 ఎంపీ సీట్లు వస్తాయని.. వైసీపీ 8స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వేలో తేలింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది.
తమ గెలుపును ఎవరూ ఆపలేరంటూ ధీమాగా కనిపిస్తున్నారు. ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సంబరపడి ముందే మురిసిపోకండి అంటూ.. ఓ డిస్కషన్ కనిపిస్తోంది. నిజానికి ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్ (India Today Exit Polls) చాలావరకు నిజం అయ్యాయ్. ఐతే మై యాక్సిస్ ఇండియాతో కలిసి చేసినప్పుడు మాత్రమే.. అవి నిజం అయ్యాయ్. సీఓటర్‌తో చేసిన సర్వేలన్ని రివర్స్ అయ్యాయ్. ఇదే ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేసేలా చేస్తున్నాయ్. ఏ సర్వేను అయినా నమ్మాలంటే.. ఆ సంస్థ ట్రాక్ రికార్డు లెక్కలోకి తీసుకోవాలి. సీఓటర్‌కు చెత్త ట్రాక్ రికార్డ్ ఉందని.. ఇది కావాలని టీడీపీ చేయించిన సర్వే అని.. వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 14లోక్‌సభ స్థానాలు వస్తాయని.. 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని సీఓటర్ సంస్థ తెలిపింది. చివరికి ఫలితాలు వన్‌సైడ్ అయ్యాయ్. ఆ ఎన్నికల్లో వైసీపీ 22 లోక్‌సభ స్థానాల్లో, 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 3 లోక్‌సభ స్థానాలు, 23 శాసనసభ స్థానాలకు పరిమితమైంది.
2023లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీఓటర్ అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయ్. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 45 నుంచి 51 స్థానాలు వస్తాయని ప్రీపోల్ సర్వేలో తెలపగా.. 41 నుంచి 53 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలిపింది సీఓటర్ సంస్థ. ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌కు 35 స్థానాలు, బీజేపీకి 54 స్థానాలు వచ్చాయ్. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలోనూ కాంగ్రెస్‌కు 118 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. ఎగ్జిట్ పోల్ సర్వేలో 113 నుంచి 137 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని సీఓటర్ సంస్థ తేల్చింది. ఐతే బీజేపీకి 163 స్థానాలు రాగా.. కాంగ్రెస్ 66 స్థానాలకే పరిమితమైంది. అంటే ఈ సంస్థ చేసిన సర్వేలన్ని రివర్స్ అయ్యాయని రికార్డులు చెప్తున్నాయ్. అంటే సీఓటర్ సర్వే ప్రతీసారి తేడా కొట్టేస్తుందనే పాయింట్‌ను ఇప్పుడు వైసీపీ నేతలు పట్టుకున్నారు. ఐతే టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తున్నారు.