సమగ్ర సర్వే కోసం వెళితే మమ్మల్ని తిడుతున్నారు
తెలంగాణాలో సమగ్ర సర్వే వ్యవహారం ఇప్పుడు కాస్త సంచలనం అవుతోంది. ఈ తరుణంలో బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం అయింది. సర్వే కోసం వెళితే సీఎం రేవంత్ రెడ్డిని జనం తిడుతున్నారని పలువురు ఎన్యుమరేటర్లు చెప్పడం గమనార్హం.

తెలంగాణాలో సమగ్ర సర్వే వ్యవహారం ఇప్పుడు కాస్త సంచలనం అవుతోంది. ఈ తరుణంలో బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం అయింది. సర్వే కోసం వెళితే సీఎం రేవంత్ రెడ్డిని జనం తిడుతున్నారని పలువురు ఎన్యుమరేటర్లు చెప్పడం గమనార్హం. ఈ ఏడాదిలో ఆయన వల్ల మాకేం ఒరిగిందని, మాకు ఏమిచ్చాడని అంటున్నారని ప్రజలు అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయినవారు తీవ్రమైన కోపంతో ఉన్నారట.
సర్వే కోసం వెళ్తే.. కుక్కలను ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో కొందరు ఇళ్ల యజమానులు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పి బెదిరింపులకు దిగడం సంచలనం అవుతోంది. అరోరా కాలనీలో నివసించే మరో మహిళ వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారట. ఇఇక మరికొందరు తలుపులు తీయడం లేదని, వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలని ప్రశ్నించారట.