Pragati Bhavan : ప్రగతి భవన్ లో సామాన్యుల హల్ చల్.. కేసీఆర్ కుర్చీలో విలాసంగా ఓ అనామకుడు..

నిన్న మొన్నటి వరకు అటు వైపు కన్నెత్తి చూడాలంటే జనం భయపడేవారు. చుట్టూ కంచెలు.. ఇనుప తెరలు, పోలీస్ పహారా నిజంగా రాజు గారి కోటని తలపించేది. నిజాం పాలన పోయినా10 యేళ్ళు పక్కా నిజాం లాగే బతికాడు కేసీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 11:14 AMLast Updated on: Dec 18, 2023 | 11:14 AM

In Pragati Bhavan The Commotion Of Common People An Anonymous Person Is Luxurious In Kcrs Chair

 

నిన్న మొన్నటి వరకు అటు వైపు కన్నెత్తి చూడాలంటే జనం భయపడేవారు. చుట్టూ కంచెలు.. ఇనుప తెరలు, పోలీస్ పహారా నిజంగా రాజు గారి కోటని తలపించేది. నిజాం పాలన పోయినా10 యేళ్ళు పక్కా నిజాం లాగే బతికాడు కేసీఆర్.

అధికారంలోకి రావడమే ఆలస్యం ఆయన మొట్టమొదట చేసిన పని తొమ్మిది ఎకరాల్లో తనకు ఓ కోట కట్టుకోవడం. పేరుకి ప్రగతిభవనైన దాంట్లో ఏనాడు సామాన్యులకి ఎంట్రీ లేదు. అసలు మంత్రులకే ఎంట్రీ లేదు. ఏనాడు సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ను కోటలాగే భావించారు. అసలా భవన్లో ఏముంటుందో కూడా ఎవరికి తెలియదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ప్రగతి భవన్ లోపల చూసిన వాళ్లు కూడా చాలా తక్కువ. అలా దాని మెయింటైన్ చేశారు కెసిఆర్. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనప కంచెను తొలగించడం.

ఆ తర్వాత ప్రగతి భవన్ కి సామాన్యుల్ని అనుమతించడం. డిప్యూటీ సీఎం బట్టికి ప్రగతిభవన్లో ఒక భాగాన్ని ఆయన అధికార నివాసంగా కేటాయించారు. ఆ సందర్భంగా సామాన్య జనం కూడా ప్రగతిభవn లోపలికి వెళ్లి కలియతిరిగి వచ్చారు. జనం సొమ్ముతో ఈ పదేళ్లు కేసీఆర్ ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారు జనమే స్వయంగా చూశారు. కెసిఆర్ కూర్చున్న కుర్చీ పై కసిగా విలాసంగా కూర్చుని ఫోటోలు దిగారు. కెసిఆర్ కుటుంబ అహంకారాన్ని ఎలా నేలమట్టం చేశాం. చెప్పుకుంటూ ప్రగతి భవన్ కూడా ఇకపై సామాన్యులు తిరిగే చోట అదేమీ నిజాం కోట కాదు అని చెప్పుకున్నారు. ప్రగతి భవన్ లో కొందరు దిగిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.