BRS Manifesto : బీఆర్ఎస్ 2023 నూతన మేనిఫెస్టో లో ముఖ్యంగా ఉండేవి పథకాలు ఇవే నా.. ?
2023 బీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఎక్కువగా.. రైతులు, మధ్యతరగతి, యువత, మహిళలు, టార్గెట్ గా కేసీఆర్ గురి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.

Telangana Chief Minister BRS chief KCR announced the BRS manifesto at Telangana Bhavan in Hyderabad
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అందరికి బీ ఫామ్ లు ఇస్తారనే ప్రచారం జరిగింది గానీ కేవలం 51 భీఫామ్ మాత్రమే పూర్తి అయ్యాయిని.. మిగతా వారికి పూర్తి కాగానే వారికి బీ ఫామ్ లు అందిస్తామని కేసీఆర్ వెల్లడించారు. పార్టీ తరఫున తెలంగాణ భవన్ లో అభ్యర్థులకు ఎన్నికల ప్రచార ఖర్చు చెక్కులు కూడా మహాన్నం 2 గంటలకు అందజేయనున్నారు.
2023 బీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఎక్కువగా.. రైతులు, మధ్యతరగతి, యువత, మహిళలు, టార్గెట్ గా కేసీఆర్ గురి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ 2023 మేనిఫెస్టో ఇదేనా..?
- ఆసరా పెన్షన్లను రూ. 2016 నుంచి రూ. 3016కు పెంపు..
- కళ్యాణ లక్ష్మీ రూ. 100116 నుంచి రూ. 200116 పెంచే అవకాశం..
- రైతుబంధు పథకంలో ప్రస్తుతం ఎకరాకి రూ. 16వేల వరకు పెంచే ప్లాన్..
- రైతులకు ఉచిత ఎరువులు.. కౌలు రైతలకు ఆర్ధిక సహాయం..
- 50 ఏండ్లు దాటిన రైతులకు 2000 పెన్షన్ ఇచ్చే ప్లాన్..
- వృద్దులకు ఫౌష్టికాహారం అందించే పథకం..
- మహిళా సాధికారిత కోసం మహిళా బంధు లాంటి పథకం..
- మహిళలకు ప్రతీ నెల పెన్షన్, ఉచిత బాస్ పాస్..
- సీనియర్ సిటిజన్స్ సంక్షేమం..
- పేదలకు వైద్య ఖర్చులకు పదిలక్షల ఉచిత వైద్య బీమా పథకం
- నిరుద్యోగ భృతిపై కూడా కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం..
ఈ నెల 15 నుంచి.. నేటి నుంచే బీఆర్‌ఎస్ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో అధికారికంగా పాల్గొని.. సమర శంఖారావం పూరించనున్నారు. పూర్తిగా ఎన్నికల ప్రచారంలో 17 రోజులు, 42 సభలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే సభలో గత పథకాల అమలు గురించి.. నూతన మేనిఫెస్టో కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు.
S.SURESH