బ్రేకింగ్: రేవంత్ మంత్రి వర్గంలో మరో రెడ్డి గారు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాజ్ గోపాల్ రెడ్డికి దసరా కానుక ఇవ్వనుంది కాంగ్రెస్ అధిష్టానం.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాజ్ గోపాల్ రెడ్డికి దసరా కానుక ఇవ్వనుంది కాంగ్రెస్ అధిష్టానం. దసరా లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పే సూచనలు కనపడుతున్నాయి. ముందుగా ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి వర్గంలోకి తీసుకునే సూచనలు ఉన్నాయి.
ఆయన సోదరుడు వెంకట రెడ్డి ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్నారు. రెండో విడత కేబినెట్ విస్తరణ లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖరారైపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2023 ఎన్నికల ముందు రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అధిష్టాన దూతలు… ఆ తర్వాత భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే పదవి గ్యారెంటీ అని క్లారిటీ ఇచ్చారు. సామాజిక ఈక్వేషన్స్ అడ్డొచ్చినా…ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే భావనతో ఆయనకు మంత్రి పదవి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ పరిధిని బేస్ చేసుకుని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపుతోంది.