India Alliance: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖరారు.. మద్దతు తెలిపిన మమత, కేజ్రీవాల్
ఢిల్లీలో ఇటీవల సమావేశమైన కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించాయి.
India Alliance: కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియాకు సంబంధించి ప్రధాని అభ్యర్థి విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సందేహాలకు తెరదించుతూ ప్రధాని అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి. ఢిల్లీలో ఇటీవల సమావేశమైన కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.
T CONGRESS: ఓడిపోయినా కూడా వాళ్లే ఎమ్మెల్యేలా..? కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..
వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించాయి. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే కూటమి తరఫున మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి అవుతారని స్పష్టం చేశాయి. ముందుగా మల్లికార్జున్ ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రతిపాదించారు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మిగతా పార్టీలు కూడా ఖర్గే అభ్యర్థిత్వంపై సానుకూలంగానే స్పందించాయి. దీంతో దాదాపుగా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ఏకగ్రీవం అయినట్టే. అయితే, ఈ విషయాన్ని ఇండియా కూటమి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రధాన మంత్రిగా దళిత నాయకుడిని ప్రకటించడం తమ విజయానికి దోహదపడుతుందని ఇండియా కూటమి భావిస్తోంది.
ప్రధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడంతో కీలకమైన కన్వీనర్ పదవికి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మమతా బెనర్జీ, జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్‌లలో ఒకరిని కూటమి కన్వీనర్‌గా ఎన్నుకుంటారని సమాచారం. ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. సీట్ల పంపకం విషయంలో విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోటీ చేయలేదు. ఎవరికి వారే సొంతంగా బరిలోకి దిగారు. దీంతో తెలంగాణలో ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.