భారత్ ఒకే ఒక్క నిర్ణయంతో సీన్ రివర్స్, బంగ్లాదేశ్ ఇక అడుక్కు తినాల్సిందేనా?
యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న వ్యూహాలు కూడా శత్రువు అంతు చూస్తాయి. మోడీ సర్కార్ యాక్షన్‌లో ఆ నిజం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తెలిసొస్తోంది.

యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న వ్యూహాలు కూడా శత్రువు అంతు చూస్తాయి. మోడీ సర్కార్ యాక్షన్‌లో ఆ నిజం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తెలిసొస్తోంది. మన శత్రువు చైనా గడ్డపై నిలబడి మనల్ని చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేసిన యూనస్‌కు ఒక చిన్న ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చింది భారత్. ఎవరు ఎవరిపై ఆధారపడ్డారో కన్నింగ్ యూనస్‌కు తెలిసి వచ్చేలా, కలలో కూడా ఊహించని నిర్ణయంతో ఢాకా మైండ్ బ్లాంక్ చేసేసింది. మరోసారి భారత్ పేరు ఎత్తే ధైర్యం చేయకుండా ఢాకా ఆర్థిక వ్యవస్థపై ఊహించని దెబ్బే కొట్టింది. ఇంతకూ, చైనా గడ్డపై నిలబడి మన దేశాన్నే బెదిరించే ప్రయత్నం చేసిన యూనస్‌కు మోడీ సర్కార్ ఇచ్చిన స్ట్రోక్ ఏంటి? ఆ నిర్ణయం ఢాకా ఆర్థిక వ్యవస్థను ఎలా ధ్వంసం చేయబోతోంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌గా మారింది. హిందువులపై దాడులు, ఆలయాల విధ్వంసాలూ అక్కడ కామన్ అయిపోయాయి. ఈ పరిస్థితులను అడ్డుకోవాలని భారత్ తన స్థాయికి ఎన్నోమెట్లు కిందికి దిగి రిక్వెస్ట్ చేసింది. మొదట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకా వెళ్లి యూనస్‌ను రిక్వెస్ట్ చేశారు, అయినా మారలేదు.. తర్వాత జైశంకరే రంగంలోకి దిగి స్నేహమో, సమరమో తేల్చుకోమన్నారు, అప్పుడూ దారికి రాలేదు.. పైగా పాకిస్తాన్, చైనా అండ చూసుకుని భాతర వ్యతిరేకతే లక్ష్యంగా రెచ్చిపోయింది యూనస్ సర్కార్. చివరికి తాత్కాలిక ప్రభుత్వాధినేత తన చైనా పర్యటనలోనూ అదే చేశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా చర్చల ద్వారా బంగ్లాను దారికి తెచ్చుకోవచ్చు అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరేదీ ఉండదు. అందుకే, మోడీ సర్కార్ యాక్షన్ మార్చింది. భారత్ అదునుచూసి కొట్టిన ఆ దెబ్బే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో అబ్బా అనిపిస్తోంది.
ఈశాన్య రాష్ట్రాలపై కన్నింగ్ కామెంట్స్ చేసిన యూనస్‌కు మోడీ సర్కార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. బంగ్లాదేశ్‌కు అందిస్తున్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని భారత్ రద్దు చేసింది. భారత్, బంగ్లాదేశ్‌కి మధ్య దాదాపుగా 1600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్‌కి మూడు వైపులు భారత్, ఓవైపు బంగాళా ఖాతం ఉంది. బంగ్లాదేశ్ తన ఉత్పత్తుల్ని అమ్ముకోవాడానికి ఇన్నేళ్లు ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యం ద్వారా భారత రోడ్డు రవాణాతో పాటు పోర్టులు, ఎయిర్‌పోర్టుల్ని వాడుకుండి. తన ఉత్పత్తులను భారత్ ద్వారా భూటాన్, నేపాల్ వంటి దేశాలకు తరలించింది. అయితే, ఇప్పుడు భారత్ దీనిని రద్దు చేయడంతో బంగ్లాదేశ్‌ను చావుదెబ్బ దెబ్బకొట్టినట్టయింది. ఈ సౌలభ్యం కారణంగా భారత పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో రద్దీ ఏర్పడుతోంది. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. కానీ, ఇది పైకి చెప్పే రీజన్ మాత్రమే. అసలు కారణం బంగ్లాదేశ్‌కు భారత్ పవరేంటో చూపించడమే. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ నిర్ణయం వలన తమపై ఎలాంటి ప్రభావం పడదని బంగ్లాదేశ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. జరగబోయే నష్టం ఆ దేశానికి కంటిమీద కునుకులేకుండా చేస్తుందనడంలో అనుమానమే అవసరం లేదు.
చైనా వెళ్లి యూనస్ చేసిన ఘనకార్యం ఏంటంటే.. ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదంటూ హద్దుమీరారు. అక్కడితో ఆగలేదు.. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, లేక మతిమరుపోగానీ.. భారత్‌కు రెండువైపులా 6వేల 500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న ఆలోచన యూనస్‌కు తట్టలేదు. భారత ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే… జల రవాణాను పెంచితే దేశంలోని ఏ తీర ప్రాంతం నుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని? ఈ చిన్న లాజికే యూనస్ మిస్ అయ్యారు. అందుకే, ఎవరు ఎవరిపై ఆధారపడ్డారో యూనస్‌కు గట్టిగా గుర్తు చేసే ప్రయత్నం చేసింది భారత్.
నిజానికి.. బంగ్లాదేశ్ పూర్తిగా కష్టాల్లో ఉంది. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపేశారు. ఢాకా తీరుతో భారత్ కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో ఢాకా తీవ్రంగా సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి పాకిస్తాన్‌ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్‌నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే ఖర్చు తడిసి మోపెడవుతోంది. బంగ్లా ప్రభుత్వాధినేత అయిన తర్వాత యూనస్‌ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి విదేశీ పర్యటనకు పనికట్టుకుని చైనాను ఎంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతచేసినా చైనా చేస్తానన్న సాయం కేవలం 210 కోట్ల డాలర్లే. దాదాపు 100సంస్థలు 100కోట్ల డాలర్లు మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువులేదు. ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో లేదో కూడా తెలియదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం.. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని నిలిపివేయాలనే ఆలోచన చేయడానికి కారణం.. యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలే. అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని.