INDIA Vs BHARATH: ఇండియా వద్దు.. భారత్ ముద్దు.. సెలబ్రిటీల నుంచి పెరుగుతున్న మద్దతు..
దేశానికి భారత్‌గా నామకరణం చేయాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
INDIA Vs BHARATH: ప్రస్తుతం చర్చంతా దేశం పేరు చుట్టూ తిరుగుతోంది. ఇటీవల G20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో ఈ చర్చలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏకమైన సంగతి తెలిసిందే.
ఇండియా పేరు పెట్టుకోవడాన్ని బీజేపీ ఆది నుంచి తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ వివాదాలు కొనసాగుతున్నప్పుడు దేశం పేరు ‘ఇండియా’ మార్పు అంశం తెరపైకి రావడం ఆసక్తిని కలిగిస్తోంది. దేశానికి భారత్‌గా నామకరణం చేయాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ విషయంపై, రాజకీయ నాయకులతో పాటు, స్పోర్ట్స్ లెజెండ్స్ కూడా తమ స్టాండ్ ని వెల్లడిస్తున్నారు.
ఇకపై మనం ఇండియా అనొద్దు, భారత్ అని పిలుచుకుందాం అంటూ, అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయగా, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా భారత్ ముద్దు, ఇండియా వద్దు అంటూ తన మద్దతును తెలుపుతున్నాడు. ఈ ట్రెండింగ్ టాపిక్ మీద నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తూ, చర్చకు ఆజ్యం పోస్తున్నారు.