లడ్డుపై సుప్రీం ఏం చేయబోతోంది?

తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందా అని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వై వి సుబ్బారెడ్డి, సుబ్రమణ్య స్వామి తో పాటు మరో ఇద్దరు తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2024 | 09:38 AMLast Updated on: Oct 03, 2024 | 9:38 AM

India Waiting For Supreme Comments On Tirumala Laddu Isse

తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందా అని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వై వి సుబ్బారెడ్డి, సుబ్రమణ్య స్వామి తో పాటు మరో ఇద్దరు తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై తొలి రోజు బాత్రూం జరిగాయి. జస్టిస్ గవాయి ,జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరూ వేసిన ప్రశ్నలు ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బాబు ఇరుకును పెట్టేటట్లుగా ఉన్నాయి. లడ్డు కల్తీ జరిగిందా? కల్తీ జరిగిందని అనుమానంతో నెయ్యి ట్యాంకర్ని వెనక్కి పంపించినప్పుడు, ఆనైతో లడ్డు తయారు చేసే అవకాశం లేదు కదా? నెయ్యి క్వాలిటీ పై ఎన్ డి డి బి తో పాటు మైసూర్ లేదా ఘజియాబాద్ ల్యాబ్స్ లో ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు ? ఈవో…. సీఎం చంద్రబాబు మాటల్లో వైరుధ్యం ఎందుకు ఉంది? లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి ఎలా చెప్పగలిగారు? ఇలా కొన్ని ప్రశ్నలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంధించారు.

అంతేకాక ఈ వివాదంపై కేంద్రం దర్యాప్తు చేయిస్తుందా..? చేయిస్తే ఏ విధంగా చేస్తుంది ? లడ్డుపై సిబిఐ దర్యాప్తు… లేదా నిపుణుల కమిటీ దర్యాప్తు, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు తానే వేస్తానని కేంద్రం అంగీకరిస్తే.. దానికి కోర్టు ఆమోదిస్తే చంద్రబాబు నాయుడు బతికిపోయినట్లే. లడ్డు వ్యవహారంలో టిడిపి జనసేనకు కావలసినంత పొలిటికల్ మైలేజ్ వచ్చేసింది కనుక, అసలు కల్తీ జరిగిందా లేదా అన్నది ఇప్పట్లో తేలిన తేలకపోయినా వచ్చే నష్టం లేదు. ఒకవేళ కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిటీనే కొనసాగించండి… ఇంత టైం పీరియడ్లో నివేదిక ఇవ్వండి అంటే కూడా చంద్రబాబు నాయుడు కి అడ్వాంటేజ్ అవుతుంది. వీటన్నిటినీ కాకుండా సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో ఒక దర్యాప్తు సంఘాన్ని వేస్తే కనుక అప్పుడు పరిస్థితులు మారొచ్చు. ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి.