షరీఫ్‌కు టార్చర్ చూపిస్తున్న ఇండియన్స్ ,భారత్‌ను ఓడిస్తాడట.. అంతమగాడివా?
షెహబాజ్ షరీఫ్.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బ్రదర్, పాక్ ప్రస్తుత పీఎం కూడా. లీడర్‌గా ఇతడికి ఎంత గుర్తింపు ఉందో చెప్పడం కష్టం కానీ, ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రం కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నాడు

షెహబాజ్ షరీఫ్.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బ్రదర్, పాక్ ప్రస్తుత పీఎం కూడా. లీడర్‌గా ఇతడికి ఎంత గుర్తింపు ఉందో చెప్పడం కష్టం కానీ, ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రం కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నాడు. షరీఫ్ చేతికి మైక్ చిక్కితే దాని పనైపోయినట్టే. ఇతగాడి ఆవేశం దెబ్బకు మైకులు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జనాన్ని రెచ్చగొట్టడానికి అలా ప్రవర్తిస్తాడో లేక జనాన్ని చూస్తేనే ఆవేశం పొడుచుకువస్తుందో అతడికే తెలియాలి. ఈ ఆవేశం స్టార్ ఇటీవల మరోసారి ఊగిపోయాడు. అదికూడా ఇండియాను ఓడిస్తాం అనీ, అభివృద్ధిలో భారత్‌ను వెనక్కి నెట్టకపోతే తన పేరే మార్చేసుకుంటా అని శపథం చేశాడు. కట్‌చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చేతిలోనే ఘోరాతి ఘోరంగా ఓడింది పాకిస్తాన్. అక్కడ మొదలు ఈ ఆవేశం స్టార్ అంతుచూడ్డం మొదలు పెట్టారు నెటిజన్లు. పాక్ పీఎంకు చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతూ టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టాప్ స్టోరీలో చూద్దాం..
ఎవరికైనా ప్రత్యర్ధిని ఓడించలం అనే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు.. అందులో ఏ తప్పూ లేదు. కానీ, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే చిక్కంతా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి అదే. ఆ దేశంలో పాలన అంతా భారత్‌పై వ్యతిరేకత చుట్టే నడుస్తుంది. ఇండియాను విమర్శిస్తే చాలు పాకిస్తానీలు నెత్తిన పెట్టుకుంటారని అక్కడి పాలకులు నమ్ముతారు. షరీఫ్ కూడా అదే నమ్మాడు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీఖాన్‌ను ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సందర్శించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జనాన్ని చూసి మనోడికి పూనకాలు వచ్చేశాయి. ఇంకేముంది వాస్తవాలను పక్కన పెట్టి.. గొప్పలకు పోయి ప్రగల్భాలు పలికాడు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు అని ఊగిపోయాడు. పాకిస్తాన్‌లో ప్రజల పరిస్థితిని మెరుగుపరచడానికి తాము రాత్రనకా పగలనకా పని చేస్తున్నామనీ తెగ బిల్డప్పులు ఇచ్చాడు. కట్‌చేస్తే.. ఈ ప్రగల్భాలు పలికిన రెండు వారాలకే.. భారత్ తమతో చర్చలు ప్రారంభించాలని వేడుకుని అభాసుపాలయ్యాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మన చేతిలోనే వాళ్ల టీమ్ ఘోరంగా ఓడిపోవడంతో పెటిజన్లు షరీఫ్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఏ విషయంలోనైనా ఢాంబికాలకు పోవడం పాకిస్తాన్‌కు అలవాటే. ఇక భారత్ విషయానికి వచ్చే సరికి.. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు చేయడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఇక భారత్‌తో ప్రతీ విషయంలో పోల్చుకుని.. చివరికి బొక్కబోర్లా పడటం పాకిస్తాన్‌కు అలవాటే. రియాలిటీ ఏంటంటే..ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మత ఛాందసవాదంతో కొట్టుమిట్టా డుతోంది. భారత్‌తో పోల్చుకోవడం కాదు కదా.. కనీసం ప్రజలకు తినడానికి తిండిపెట్టే పరిస్థితి కూడా ఆ దేశంలో లేదు. రెండేళ్ల క్రితం గోధుమ పిండి బస్తాల కోసం యుద్ధాలు చేసిన విజువల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల వద్ద అప్పులు తెచ్చు కుని పబ్బం గడుపుతున్న పాక్.. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియాను దాటడం కలలో కూడా జరగని పని. దీంతో భారత్‌ను ఓడించే అంత సీన్ పాక్‌కు లేదని.. షరీఫ్ పేరు మార్చుకోవడం పక్కా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి.. షెహబాజ్ షరీఫ్ ఇంతలా ఆవేశంతో ఊగిపోవడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఈయన మైకులు పగలగొట్టాడు. ఇప్పటికీ ఈ ఆవేశం స్టార్ ఆవేశపూరిత ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
విపరీతమైన కోపం, పట్టరాని ఆవేశం, తట్టుకోలేని ఆక్రోశం, మైక్ కనిపిస్తే చాలు ఊగిపోయే మనస్తత్వం.. ఇవన్నీ షరీఫ్‌ను ఆవేశం స్టార్‌గా మార్చేశాయి. హిస్టీరియా వచ్చిన వాడిలా ఊగిపోయే షరీఫ్ ను ఆపడం కష్టం అని ఆ దేశ జనం ఎప్పుడో రియలైజ్ అయిపోయారు. కనీసం తన ప్రసంగం వీడియోలు, వాటిపై వస్తున్న ట్రోలింగ్స్ చూసి అయినా షరీఫ్ హుందాగా నడుచుకోకపోవడం చాలా విచిత్రం. షరీఫ్ ఆవేశాన్ని కాస్త పక్కనపెడితే.. ప్రస్తుతం పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ట్రోఫీపై ఉగ్ర మూకల కన్ను ఉన్నట్టు ఒక నివేదిక తేల్చింది. ఈ నివేదికలో ఉగ్రవాద దాడులతో పాటు, కిడ్నాప్‌లకు కూడా ప్రణాళికలు వేస్తున్నారని పేర్కొన్నారు. టోర్నమెంట్‌పై ఈ ముప్పు పొంచి ఉందని పాక్‌తో పాటు, భారత నిఘా సంస్థలకు కూడా సమాచారం అందింది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో కనుక ఏదైనా తేడా వస్తే.. అభివృద్ధిలో భారత్‌ను ఓడించడం కాదు.. టోటల్ పాకిస్తాన్ గేమ్ ఓవర్ కావడం ఖాయం. ఒక్కటి మాత్రం నిజం ఇలాంటి ఆవేశం స్టార్లు ఉన్నంత కాలం పాకిస్తాన్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాదు.. ఆ దేశ ప్రజల కష్టాలూ తీరవు. సింపుల్‌గా చెప్పాలంటే ఇదంతా పాకిస్తానీల ఖర్మ అంతే. అన్నట్టు షరీఫ్‌కు ఏ పేరు పెడితే బావుటుంది? కామెంట్ చేయండి?https://www.youtube.com/watch?v=QgoiVK4c9Dw