జనసేనాని ఒంటిపై జంధ్యం… ఎలా వచ్చిందో తెలుసా?
పవన్ కళ్యాణ్ పుట్టుకతో కాపు కులస్తుడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. శూద్రుడైన వ్యక్తి ఇలా యజ్ఞోపవితం వేసుకుని గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం చూసి జనం షాక్ అయిపోయారు.

పవన్ కళ్యాణ్ పుట్టుకతో కాపు కులస్తుడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. శూద్రుడైన వ్యక్తి ఇలా యజ్ఞోపవితం వేసుకుని గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం చూసి జనం షాక్ అయిపోయారు. పవన్ ఒంటిపై జంధ్యం ఎలా వచ్చింది… అన్నదే ఇక్కడ అందరి ప్రశ్న.8 ఏళ్ల క్రితమే పవన్ బ్రాహ్మణికం స్వీకరించారు.పవర్ స్టార్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా పవన్ కళ్యాణ్ ని కాశీ తీసుకుని వెళ్లి అక్కడ ఆయనను బ్రాహ్మణుడిగా మార్చారు. అప్పటినుండి పవన్ కళ్యాణ్ కచ్చితంగా జంధ్యం ధరిస్తారు. దీన్ని చాలా మంది ఆక్షేపించవచ్చు. బ్రాహ్మణికం పుట్టుకతోనే వస్తుంది తప్ప దీన్ని ఎవరు ఎలా పడితే అలా స్వీకరించడం కుదరదని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనుశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని నాలుగు రకాలుగా విభజన జరిగింది. ఆ తర్వాత పంచములు కూడా దానికి తోడయ్యారు.
మనుషులనీ పుట్టుక ఆధారంగా నాలుగు విధాలుగా విభజించినప్పుడు ఎవరు ఎలా పడితే అలాగా కులం గోత్రం మార్చుకోవచ్చా? అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ పవన్ అన్ని విధాలుగా పరిశోధన చేసిన తర్వాతే బ్రాహ్మణికం స్వీకరించాడు. పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణులు కారు…. వారి వారి చర్యలు…. పూజలు… జీవన విధానం ద్వారా వారు బ్రాహ్మణులుగా గుర్తించబడతారు అనేది వేదాల్లోనే ఉంది. శూద్రులుగా ,క్షత్రియులుగా పుట్టిన వాళ్లు కూడా అందుకు భిన్నమైన జీవితం గడుపుతూ…. బ్రాహ్మణులుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ కాశీ వెళ్లి బ్రాహ్మణికం స్వీకరించారు. అయితే దీని వెనక త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది. పవన్ కళ్యాణ్ కు బ్రాహ్మణికం అవసరాన్ని చెప్పి అతన్ని మార్పించింది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతేకాదు ఆ తర్వాత తన ఆహారపు అలవాట్లు, జీవన విధానం పూర్తిగా మార్చుకున్నాడు పవన్ కళ్యాణ్. మాంసాహారాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు. నిత్యం పూజా, పునస్కారాలు కచ్చితంగా చేస్తాడు.
వారాహిమాతను ఆయన పూజిస్తాడు. అంతేకాదు చాతుర్మాస దీక్ష కూడా చేస్తారు. కార్తీక మాసంలో ఒంటిపూట భోజనం చేయడం పవన్ అలవాటుగా మార్చుకున్నాడు. గడిచిన 8 ఏళ్లుగా పూర్తిగా బ్రాహ్మణికం అనుసరించే విధానాలనే పాటిస్తున్నాడు పవన్. దాంట్లో భాగంగానే ఆయన యజ్ఞోపయితం కచ్చితంగా ధరిస్తాడు. ఇది కేవలం కొందరు సన్నిహితులకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు సంధ్యావందనం… చేయకపోయినప్పటికీ మిగిలిన పూజ కార్యక్రమాలన్నీ పద్ధతిగా చేస్తాడు పవన్. పవన్ యజ్ఞోపవితాన్ని ధరించడాన్ని కొందరు ఆక్షేపించవచ్చు. పవన్ కళ్యాణ్ ని స్వయం ప్రకటిత బ్రాహ్మణుడు అని వెక్కిరించి వచ్చేమో. కానీ పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణులు కాదు. వారి వారి విధులు… కర్తవ్య నిర్వహణ ద్వారా బ్రాహ్మణులుగా గుర్తించబడతారు అనే సూత్రాన్ని పవన్ ఆచరించి చూపించారు. అదే జనసేన అని జంధ్యం సీక్రెట్.