చివరికి ఏం మిగిలింది? ఏం కట్టుకెళ్ళింది?

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాణిలా వెలిగింది, తమిళ రాజకీయాల్లో ఒక నియంతలా కొనసాగింది. తన మాటే శాసనం, తన చూపే చట్టంలా బతికింది. అహంకారం, అంతకుమించి అధికారం, అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేక పోయాయి. జీవచ్ఛవంలా సెలైన్ బాటిల్లతో ఆఖరి ఘడియల్లో బతికేళ్ల తీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 05:23 PMLast Updated on: Feb 01, 2025 | 5:23 PM

Intersting Facts About Tamilnadu Ex Cm Jayalalitha

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాణిలా వెలిగింది, తమిళ రాజకీయాల్లో ఒక నియంతలా కొనసాగింది. తన మాటే శాసనం,
తన చూపే చట్టంలా బతికింది. అహంకారం, అంతకుమించి అధికారం, అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేక పోయాయి. జీవచ్ఛవంలా సెలైన్ బాటిల్లతో ఆఖరి ఘడియల్లో బతికేళ్ల తీసింది. ఆమె ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పురచి తలైవి… వన్ అండ్ ఓన్లీ అమ్మ జయలలిత. ఇప్పుడు నాలుగు వేల కోట్ల ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందో అర్థం కాక చివరికి ప్రభుత్వ పరం చేస్తున్నారు. బతుకంతా ఆరాటపడి కూడ పెట్టినవి ఏవి మనతో రావని జయలలిత ఆస్తులు కథ మరోసారి ప్రపంచానికి చెప్పింది.

దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం జడ్జ్ అధికారులను ఆదేశించారు. జై లలిత అనుచరులు, సహచరులు, పార్టీ నేతలు మింగేయగా మిగిలిన ఆస్తులు విలువే ప్రభుత్వం లెక్కల ప్రకారం నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మార్కెట్ విలువ లో అది ఇంకా చాలా ఉండొచ్చు.1562 ఎకరాలకు సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పదివేలకు పైగా చీరలు, 750 కి పైగా జతలు చెప్పులు, అత్యంత కాస్ట్లీ చేతి గడియారాలు, వందల కోట్ల విలువైన బహుమతులు, ఇంకా అనేక విలువైన జ్ఞాపికలను కర్ణాటక తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పనుంది. ఈ ఆస్తులు ,వస్తువులు తమకే చెందాలంటూ…. తామే జయలలితకు నిజమైన వారసులమంటూ జే దీపక్, జే దీప వేసుకున్న పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. పది ఏళ్ళ కిందట ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ ఆస్తులు విలువ 913 కోట్లు కాగా ఇప్పుడు వాటిని విలువ 4000 కోట్లు పైనే ఉండొచ్చని అంచనా. మొత్తం మార్కెట్లో వీటి విలువను లెక్క కడితే ఇంకెన్ని వేల కోట్లు ఉంటుందో లెక్కలేదు.2016 డిసెంబర్ 5న మరణించే నాటికి జయలలిత వయసు కేవలం 68 సంవత్సరాలు. నిజానికి ఈ రోజుల్లో రాజకీయాల్లో అతి పెద్ద వయసు ఏం కాదు. డయాబెటిస్ ముదిరిపోవడం, ఒంటరితనం జయను కుంగ తీశాయి.

రాజకీయాల్లోకి రాక మునుపు తెలుగు ,తమిళ ,కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో నటించింది జయలలిత. చిత్ర సీమలో మకుటం మహారాణిగా కొంత కాలం వెలిగింది ఆమె. తమిళ ప్రజలు పురచి తలైవి గా పిలుచుకునే జయ 1991 నుంచి 96, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 ఆ తర్వాత 2015 నుంచి 2016 డిసెంబర్ 5 వరకు మరణించేదాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. మొత్తంగా ఆరుసార్లు తమిళనాడు కి సీఎంగా పనిచేసిన జయలలితపై అక్రమార్చన కేసులు నమోదయ్యాయి.91… 96 మధ్య ఆమె విపరీతంగా అధికార దుర్వినియోగం చేసి అక్రమ ఆస్తులు కూడ పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జయలలిత లైఫ్ స్టైల్ పై అంతర్జాతీయ చర్చ జరిగేది. ఆమె హయాంలో తమిళనాడు కలర్ టీవీ కుంభకోణం … దేశాన్ని కుదిపేసింది. జయతోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, ఆమె కుమారుడు సుధా కరణ్, ఇలవరసి ఇలా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా అప్పట్లోనే వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కోర్టులో కూడా రుజువైంది. టాన్సి భూముల కేసులో జయకు శిక్ష కూడా పడింది. అయితే మరణించే నాటికి ఆ కేసులు సుప్రీంకోర్టులో ఉండడంతో… దీర్ఘకాల జైలు శిక్షను జయలలిత తప్పించుకోగలిగింది. మొత్తం మీద జయలలిత తమిళనాడులో అపరిమితమైన అధికారాన్ని , అవినీతి సొమ్మును పోగేయగలిగింది. ఆమె చుట్టూ ఉన్నవాళ్లు జయ ఒంటరి జీవితాన్ని ఆసరా చేసుకొని దొరికినంత దోచుకున్నారు.

చివరికి మిగిలిన ఆస్తులు ఇప్పుడు 4 వేల కోట్ల పైచిలుకని ఒక అంచనాకొచ్చింది కోర్టు. హైదరాబాదులో కూడా జయకు ఆస్తులు ఉండేవి. అవి కొన్ని కబ్జా కూడా గురయ్యాయి. వీటన్నిటిని ఏం చేయాలో అర్థం కాక చివరికి ప్రభుత్వానికి అప్పగించింది కర్ణాటక కోర్టు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక ట్రస్టును పెట్టి… తన ఆస్తులు సేవా కార్యక్రమాలకైనా వినియోగించి ఉంటే అవి ప్రజలకు ఉపయోగపడేది. సినీ నటిగా కంటే అందుకు 1000 రెట్లు రాజకీయ నాయకురాలుగా అపారంగా, అడ్డగోలుగా సంపాదించి వెనకేసుకుని.. చివరికి వాటిని అనుభవించలేక పైకి వెళ్లిపోయింది జయ. చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో సెలైన్ బాటిల్స్ తో బతికింది. జయ పేరు చెప్పుకొని శశికళ, మరికొందరు అన్నా డీఎంకే నేతలు తమిళనాడునీ అడ్డగోలుగా దోచుకున్నారు. అధికారంతో కళ్ళు మూసుకుపోయిన జయ ఇవేమీ లెక్క చేయలేదు. జయ మరణం అందరికి గుణపాఠం. అంత సంపాదించింది… అన్ని వేల కోట్ల రూపాయలు చివరికి ఏం చేయగలిగింది? అందులో ఒక్క రూపాయి అయినా తనతో తీసుకెళ్లగలిగిందా? చనిపోయే ముందు కూడా చెడ్డ పేరు మూట కట్టుకుంది. ఒక నియంతలా వ్యవహరించి అందరిని దూరం చేసుకుంది. అలా ఉంటేనే రాజకీయాల్లో మనగలుగుతాం అని వాదించింది. మొత్తం మీద జై లలిత ఆస్తులు కథ ఇలా విషాదంగా ముగిసింది.