అవంతి…ఇక విశ్రాంతి..!
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానన్నారు. రాజకీయ జీవితం వైసీపీ అంకితమన్నారు...సీన్ కట్ చేస్తే...కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానన్నారు. రాజకీయ జీవితం వైసీపీ అంకితమన్నారు…సీన్ కట్ చేస్తే…కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఆరు నెలలు గడవకముందే ఆందోళనలు, నిరసనలు అంటే ఎలా అంటూ వైసీపీ నాయకత్వానికి ఎదురుతిరిగారు. ప్రశ్నించడంతోనే సరిపెట్టుకుంటాడని…పార్టీలోనే కొనసాగుతాడని వైసీపీ అధిష్ఠానం భావించింది. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. వైసీపీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అవంతి. వైసీపీకి గుడ్ బై చెప్పాడు సరే…మరి తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఎందుకు ప్రశంసలు కురిపించాడని అప్పట్లోనే చర్చ జరిగింది. ఇక్కడే రాజకీయ వ్యూహాం దాగుంది. అయితే తెలుగుదేశం పార్టీ…లేదంటే జనసేనలోకి వెళ్లాలని మైండ్ లో ఫిక్సయ్యాకే…వైసీపీకి రాంరాం చెప్పాడు.
తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పని చేశాడు. ఆ పార్టీ నేతలతో ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయి. అవకాశం వస్తే టీడీపీ లేదంటే…సామాజిక సమీకరణాల్లో జనసేన కండువా కప్పుకోవాలని భావించారు. వైసీపీకి రాజీనామా చేసి రెండు నెలలు గడుస్తున్నా…అటు తెలుగుదేశం, ఇటు జనసేన నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. దీంతో అవంతి శ్రీనివాసరావు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారినట్లయింది. తెలుగుదేశం పార్టీ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడా అంటే అదీ లేదు. పోతూ పోతూ…అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పై అనేక ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో మూడేళ్లకుపైగా మంత్రిగా పని చేశాడు. అధికారాన్ని అనుభవించాడు. వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. అర గంట చాలు అంటూ మహిళతో సరసాలు ఆడారు. అవంతి వీడియో…ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులు ఓ రేంజ్ లో వైరల్ చేశారు. తెలుగుదేశంపై , పార్టీ కార్యకర్తలపై ఆయన వ్యవహరించిన తీరును జనం మరచిపోతారా ? ఇప్పుడు ఏదో ప్రశంసలు కురిపిస్తే…పార్టీలోకి తీసుకుంటారని భావిస్తే ఎలా ? అందినపుడు కాళ్లు…లేదంటే జుట్టు పట్టుకుంటామంటే ఎలా కూటమి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
అవంతి శ్రీనివాస్ నియోజకవర్గం…భీమిలి. తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన్ను కాదని చంద్రబాబు లేదా లోకేశ్…మరో నేతను తీసుకునే సాహసం చేయరు. సామాజిక సమీకరణ కార్డు వేసి…జనసేనలోకి వెళ్లాలని భావిస్తే…అక్కడేం అంత ఈజీ పరిస్థితులు లేవు. ఆల్రెడీ జనసేనకు…పంచకర్ల సందీప్ ఇన్ చార్జ్ గా ఉన్నాడు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి…25వేల ఓట్లు సంపాదించాడు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్…సందీప్ కాదని…అవంతి శ్రీనివాస్ ను పార్టీలోకి తీసుకోవడం అంత ఈజీ కాదు. కూటమి పార్టీల్లోని ఏదో ఒక పార్టీలో చేరాలని…వైసీపీకి రాజీనామా చేస్తే…ఉన్నది పాయే…ఉంచుకున్నది పాయే అన్నట్లు అవంతి శ్రీనివాసరావు పరిస్థితి తయారైంది. కనుచూపు మేరలో అవంతి శ్రీనివాసరావును…పార్టీలోకి చేర్చుకునే కనిపించడం లేదు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆళ్ల నాని..టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతెందుకు…చంద్రబాబును నానా మాటలు అన్న విశాఖ జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావు, కడప జిల్లాకు చెందిన సీ రామచంద్రయ్యకు ఛాన్స్ వచ్చింది. అయితే అవంతికి మాత్రం…టీడీపీ, జనసేన పార్టీల్లో డోర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఆయన బీజేపీలోకి వెళతారా ? వెళితే కూటమి పార్టీలు ఒప్పుకుంటాయా అన్నది డాలర్ల ప్రశ్న.