ఐరన్ లెగ్ రేవంత్.. కేటిఆర్ సెటైర్లు

ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కాంగ్రెస్ కు గుండుసున్న తీసుకొచ్చిండు అంటూ ఎద్దేవా చేసారు కేటిఆర్. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2025 | 04:39 PMLast Updated on: Feb 08, 2025 | 4:39 PM

Iron Leg Revanth Ktrs Satires

ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కాంగ్రెస్ కు గుండుసున్న తీసుకొచ్చిండు అంటూ ఎద్దేవా చేసారు కేటిఆర్. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడు. రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని కొనసాగిస్తాడని.. రాహుల్ గాంధీ దేశంలో బిజెపిని గెలిపించి వస్తున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోడీ బిజెపికి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే అంటూ సెటైర్లు వేసారు. తెలంగాణ ప్రజలు తిడుతున్న తిట్లు రేవంత్ రెడ్డి వింటే తట్టుకోలేడు అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయాడన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.