CM kcr: కమ్యూనిస్టుల “సిక్స్” ఫార్ములా.. కేసీఆర్ అండ్ టీమ్ గ్రౌండ్ వర్క్ ?
బీఆర్ఎస్, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో జత కలుస్తాయా ? కేసీఆర్ సేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందా ? అనే దానిపై హాట్ డిబేట్ నడుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్గాలను టచ్ చేస్తే.. కమ్యూనిస్టులతో తాము కలిసి పోటీ చేసే ఛాన్స్ లే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.
బీఆర్ఎస్, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో జత కలుస్తాయా ? కేసీఆర్ సేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందా ? అనే దానిపై హాట్ డిబేట్ నడుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్గాలను టచ్ చేస్తే.. కమ్యూనిస్టులతో తాము కలిసి పోటీ చేసే ఛాన్స్ లే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి బలమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో వామపక్షాలకు ఉన్న కొద్దిపాటి ఓట్లు కూడా గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తాయని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ నుంచి బలమైన పోటీ ఎదురయ్యే అవకాశాలున్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు సీపీఐ, సీపీఎం పార్టీల ఓటుబ్యాంకు మద్దతు అత్యవసరమనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారట. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ అధినేత అంచనా వేస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క అసెంబ్లీ సీటు కూడా బీఆర్ఎస్ కు పెరగలేదు. అక్కడ తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల మందికిపైగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు ఉన్నారు. ఈనేపథ్యంలో ఆ జిల్లాలో వామపక్షాలతో సీట్ల షేరింగ్ కు బీఆర్ఎస్ రెడీ అవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
3 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎమ్మెల్సీ..
ఒకవేళ కేసీఆర్ పొత్తుకు నై అని చెబితే.. సీపీఐ, సీపీఎం పార్టీలు కచ్చితంగా కాంగ్రెస్ తోనే కలిసి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే.. జాతీయ స్థాయి “ఇండియా” కూటమిలో సీపీఐ, సీపీఎం పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అదే జరిగితే.. కమ్యూనిస్టుల ఓట్లు ఈజీగా కాంగ్రెస్‌కు బదిలీ అవుతాయి. దీనివల్ల వామపక్షాల ప్రభావం ఉన్న కొన్ని స్థానాల్లో రిజల్ట్ మారిపోయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితంగా వచ్చినా ఆశ్చర్యం లేదు. తన పొలిటికల్ విజన్ తో దీన్ని ముందే ఊహించిన బీఆర్ఎస్ నాయకత్వం.. కమ్యూనిస్టులకు నై చెప్పడం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై సీపీఐ, సీపీఎం ఫోకస్ పెట్టాయని తెలుస్తోంది. పొత్తులో భాగంగా చెరో 3 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని అవి గులాబీ బాస్ ను అడిగినట్టు సమాచారం. అయితే 3 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎమ్మెల్సీ ఇస్తామని బీఆర్ఎస్ వైపు నుంచి వామపక్షాలకు ప్రపోజల్ వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కమ్యూనిస్టులు మాత్రం సీట్లు 6కు తగ్గొద్దని తేల్చి చెప్పారట. హుజూరాబాద్, మునుగోడు బైపోల్స్ లో బీఆర్ఎస్ విజయంలో తమ పాత్రే కీలకమైందని వామపక్ష నేతలు పదేపదే గుర్తు చేస్తున్నారట.
ఆ 6 బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలలో..
ఈనేపథ్యంలో కమ్యూనిస్టులు కోరుతున్న 6 బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలలో కేసీఆర్ అండ్ టీమ్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిందని అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులకు ఆ 6 అసెంబ్లీ సీట్లను వదులుకుంటే.. అందుకు ప్రతిఫలంగా రాష్ట్రంలో మిగితా ఎన్నిచోట్ల ఆ పార్టీల వల్ల బీఆర్ఎస్ కు కలిసొస్తుంది ? 6 సిట్టింగ్ సీట్లను వదులుకుంటే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లో రెబల్స్ గా ఎవరెవరు మారుతారు ? అక్కడ కమ్యూనిస్టులు గెలిచే అవకాశం ఎంత ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. మరో వారం, పది రోజుల్లో బీఆర్ఎస్, వామపక్షాల పొత్తులపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందట.