Top story దర్శకుడు రాంగోపాల్ వర్మకు భయం పట్టుకుందా ? విచారణకు హాజరైతే అరెస్టు చేయడం గ్యారెంటీనా ?
అడుసు తొక్కనేల...కాలు కడగనేల అన్నది పాత సామెత. నోరు జారనేల...పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఏలా ? అన్నది కొత్త సామెత. వైసీపీ ప్రభుత్వ హయాంలో...చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్వీట్లు పెట్టారు. నరం లేని నాలుక ఉంది కదా అని...ఇష్టమొచ్చినట్లు వాగారు. తమనెవరు ఏం పీకలేరనుకున్నారు. అంతా మా ఇష్టం అన్నట్లు రెచ్చిపోయారు.
అడుసు తొక్కనేల…కాలు కడగనేల అన్నది పాత సామెత. నోరు జారనేల…పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఏలా ? అన్నది కొత్త సామెత. వైసీపీ ప్రభుత్వ హయాంలో…చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్వీట్లు పెట్టారు. నరం లేని నాలుక ఉంది కదా అని…ఇష్టమొచ్చినట్లు వాగారు. తమనెవరు ఏం పీకలేరనుకున్నారు. అంతా మా ఇష్టం అన్నట్లు రెచ్చిపోయారు. నోటికి ఎంత వస్తే…అంత అనేశారు. సీన్ కట్ చేస్తే…కేసులు, విచారణ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. శ్రీరెడ్డి మొదలుకొని…దర్శకుడు రాంగోపావల్ వర్మ దాకా…అందరూ ఫలితం అనుభవిస్తున్నారు. నేచర్ చాలా బలమైనది. అందరికి తిరిగి ఇచ్చేస్తోంది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో కొందరు రాజకీయ నేతలు, సెలబ్రెటీలు రెచ్చిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకరంగా, అశ్లీలంగా చిత్రీకరించారు. వైసీపీ ప్రభుత్వం అండతో…వీడియోలు, ట్వీట్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చరిత్రలో ఏ రాజకీయ నేతలు కానీ, సెలబ్రెటీలు కానీ దిగజారని విధంగా….జుగుప్సాకరంగా మాట్లాడారు. వర్రా రవిందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇంటూరి రవికిరణ్, పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తులతే…దారుణాతి దారుణంగా కించపరిచేలా ట్వీట్లు పెట్టారు. బూతులు తిట్టారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. కొందరైతే న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి.. పోస్టులు చేశారు. సమాజంలో తల ఎత్తుకోలేని విధంగా….కుటుంబసభ్యులకు కూడా చెప్పుకోలేని రీతిలో వీడియోలు, పోస్టులు పెట్టారు. నిజంగా ఆ ఫోటోల్లో ఉన్నది వారే అన్నట్లు నమ్మించేలా మార్ఫింగ్ చేశారు. అది నోరా…లేదంటే హుసేన్ సాగర్ అనేలా కారుకూతలు కూశారు. చిల్లర కాసులకు కక్కుర్తి పడిన వారంతా…క్షణక్షణం భయంభయంగా గడపుతున్నారు. కాలం అన్నింటికి సమాధానం చెబుతోంది. అప్పుడు రెచ్చిపోయిన వారంతా…ఇపుడు కుక్కిన పేనులా ఉంటున్నారు. కొందరు సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు అడ్రస్ లేకుండా పోయారు.
సోషల్ మీడియాలో పోస్టులను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారికి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు వర్రా రవిందర్ రెడ్డి, ఇంటూరి రవి కిరణ్, బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. వైసీపీకి అనుకూలంగా…టీడీపీ వ్యతిరేకంగా పోస్టుల పెట్టిన వారి పని పడుతోంది. వ్యూహాం సినిమా ప్రమోషన్ సమయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ…చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఐటీ చట్టం కింద, గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ…ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చి…రాంగోపాల్ వర్మకు ఈ నెల 13న నోటీసులు ఇచ్చారు. 19న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంటే…ఆర్జీవీ గైర్హాజరయ్యారు. వాట్సాప్ ద్వారా మద్దిపాడు పోలీసులకు మెసేజ్ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ కోర్టును ఆశ్రయించారు. వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. విచారణ హాజరు విషయాన్ని పోలీసులతోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
ఏపీ పోలీసుల నోటీసులతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో వణుకు పుడుతోంది. ప్రకాశం జిల్లా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మకు…భయం మొదలైనట్టుంది. 19న విచారణకు హాజరుకావాల్సి ఉంటే…వెళ్లకుండా కోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరైతే పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారేమోనన్న భయంలో ఉన్నారు రాంగోపాల్ వర్మ. అందుకే హైదరాబాద్ నుంచే వాట్సాప్ లో పోలీసులకు మేసేజ్ పంపారు. నాలుగు రోజులు సమయం కావాలని కోరారు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేసుకోవాల్సిన వర్మ…రాజకీయాల్లో వేలు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడుకు, పవన్ కల్యాణ్ కు, జనసేన పార్టీకి వ్యతిరేకంగా సినిమాలు తీశారు. అందులో వారి క్యారెక్టర్లను కించ పరిచేలా…స్థాయి తగ్గించేలా చూపించారు. ఎంతటి వ్యక్తులకైనా ఓపికకు, సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఇంతకాలం వర్మ విషయంలో సహించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్…బుద్ది చెప్పాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక వేళ విచారణకు హాజరుకాకుండా…ఇలాగే టైం పాస్ చేస్తే పోలీసుల ట్రీట్ మెంట్ వేరేలా ఉండే అవకాశం ఉంది. రాంగోపాల్ వర్మ ఎప్పుడు వెళ్లినా…అరెస్టు చేస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.