అయ్యయ్యో సునీతా.. మళ్లీ హ్యాండ్ ఇచ్చిన నాసా..?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్​కు..వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా ? వారం రోజులకే భూమ్మీదకు రావాల్సిన సునీతా, బచ్ విల్మోర్...ఇంకా ఎందుకు రాలేదు ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2025 | 06:20 PMLast Updated on: Mar 15, 2025 | 6:20 PM

Is Indian Origin Astronaut Sunita Williams Facing A Series Of Setbacks

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్​కు..వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా ? వారం రోజులకే భూమ్మీదకు రావాల్సిన సునీతా, బచ్ విల్మోర్…ఇంకా ఎందుకు రాలేదు ? అసలు వాళ్లిద్దరూ రోదసి నుంచే వచ్చే అవకాశం ఉందా ? ఈ నెల మొదటి వారంలోనే రావాల్సిన వ్యోమగాములు…రాకపోవడానికి కారణాలేంటి ? స్పేష్ ఎక్స్ క్రూ-10 మిషన్ ఎందుకు వాయిదా పడింది ?

సునీతా విలియమ్స్, బచ్​ విల్మోర్​ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అదిగో వస్తున్నారు…ఇదిగో వస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది తప్పా…వారు మాత్రం భూమ్మీదకు మాత్రం తిరిగి రావడం లేదు. 9 నెలలు పూర్తవుతున్నా…అసలు ఎప్పుడు వస్తారు ? వస్తే ఎలా వస్తారు ? అన్నది తేలడం లేదు. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్…కిందికి తీసుకొచ్చే పనిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు అప్పగించారు. మస్క్ కూడా వారిద్దర్ని సురక్షితంగా తీసుకొస్తామని పలుమార్లు చెప్పారు. ఆపరేషన్ మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో తొమ్మిది నెలలుగా రోదసీలోనే గడుపుతున్నారు సునీతా, బచ్ విల్మోర్.

తాజాగా సునీతా విలియమ్స్, బచ్​ విల్మోర్​ను భూమిపైకి తీసుకొచ్చేందుకు…నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్‌ 9 రాకెట్‌ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. క్రూ-10 మిషన్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అంతరిక్షంలో వెళ్తుందనగా…సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో క్రూ 10 మిషన్ ఆపరేషన్ వాయిదా పడింది. హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతోనే…. ఫాల్కన్‌ 9 రాకెట్‌ ను ఆపేసినట్లు నాసా వెల్లడించింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాక మరింత ఆలస్యం కానుంది. అనుకున్నట్లుగానే ఈ ఆస్ట్రానాట్స్ మార్చి 19 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరనున్నట్లు నాసా ప్రకటించింది.

ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్‌ఎస్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్‌ ఎక్స్‌ సమయం కోరడంతో…ఆలస్యం జరిగింది. 2024 జూన్‌ 5న బోయింగ్‌ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సునీతా, బచ్ విల్మోర్.. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం…వారం రోజులకే భూమ్మీదకు వచ్చేలా రోదసీలోకి వెళ్లారు. స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలు రావడంతో…రోదసీలోనే ఆగిపోయారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది. సునీతా, విల్మోర్​ను భూమికి తిరిగి సురక్షితంగా తీసుకొచ్చేందుకు గతేడాది సెప్టెంబర్​లో స్పేస్​ఎక్స్ ప్రోయోగించిన క్రూ-9 మిషన్​తో అనుసంధానం కానుంది. ఈ క్రూ-9 మిషన్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. ఇందులో నాలుగు సీట్లు ఉండగా హాగ్, గోర్బునోవ్ అనే వ్యోమగాములను..పంపించి మిగతా రెండు సీట్లను సునీతా, విల్‌మోర్‌ కోసం ఖాళీగా వదిలిపెట్టారు.

ఆల్రెడీ ISSలో ఉన్న క్రూ-9 మిషన్​లో సిబ్బందిని రిలీవ్ చేసేందుకు ఈ క్రూ-10 మిషన్​ను ప్రయోగించనున్నారు. ఈ మిషన్ ISSకు చేరుకున్న తర్వాత క్రూ-10తో కొన్ని రోజుల హ్యాండోవర్ పీరియడ్​ను పూర్తి చేసి క్రూ-9 ద్వారా ఈ వ్యోమగాములు తిరిగి భూమికి చేరనున్నారు. హ్యాండోవర్ పీరియడ్​లో అంటే క్రూ-10 టీమ్ ISSకి చేరుకున్నాక ఇప్పటికే అక్కడ ఉన్న సిబ్బంది నుంచి తమ పని గురించి సమాచారాన్ని పొందుతుంది. ఇవన్నీ అనుకున్నట్లుగానే సవ్యంగా జరిగితే ఇద్దరు సిబ్బంది మధ్య సేఫ్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో లాంఛ్ కాంప్లెక్స్ 39A వద్ద ఫాల్కన్- 9 రాకెట్ కోసం గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌తో హైడ్రాలిక్ సిస్టమ్ సమస్యను పరిష్కరించేందుకు లాంఛ్ బృందాలు కూడా కృషి చేస్తున్నాయి. ఫ్లోరిడా తీరంలోని స్ప్లాష్‌డౌన్ ప్రదేశాలలో వాతావరణం కూడా సహకరించాల్సి ఉంది. అంటే వాతావరణ పరిస్థితులను అనుసరించి శాస్త్రవేత్తలు ఈ క్రూ-10 మిషన్​ను ప్రయోగించనున్నారు.