ఉమాకు ఈసారి కూడా కష్టమే..? ఎమ్మెల్సీల్లో జనసేన డామినేషన్…?
2024 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో సంచలనాలు ఏంటి అంటే.. మైలవరం నుంచి దేవినేని ఉమా పోటీ చేయకపోవడం. ఆయనను పక్కనపెట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు సీట్ ఖరారు చేయడం అప్పట్లో సంచలనమైంది.

2024 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో సంచలనాలు ఏంటి అంటే.. మైలవరం నుంచి దేవినేని ఉమా పోటీ చేయకపోవడం. ఆయనను పక్కనపెట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు సీట్ ఖరారు చేయడం అప్పట్లో సంచలనమైంది. దీనిపై పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీలో ఉండే గట్టిగా వెనకేసిన వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు ఏ విధంగా ఖరారు చేస్తారని ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని కారణాలతో వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబునాయుడు సీట్ ఇచ్చారు.
అనుకున్న విధంగానే ఆయన మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్టీ ప్రభావంతోనే విజయం సాధించారు.. తప్పించి వ్యక్తిగత ఇమేజ్ తో కాదనేది టిడిపి నేతలు భావన. ఇక నియోజకవర్గం నుంచి దేవినేని గతంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మంత్రిగా కూడా ఆయన కష్టపడి పని చేశారనే పేరు ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఆయనకు జలవనరుల శాఖ మంత్రిగా అప్పుడు చంద్రబాబునాయుడు క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. మంత్రిగా ఆయన పనితీరు బాగున్నా ఎమ్మెల్యేగా మాత్రం నియోజకవర్గంలో ఫెయిల్ అయింది.
ఇక వైసిపి కూడా ఆయన్ ను గట్టిగా టార్గెట్ చేసి వసంత కృష్ణ ప్రసాద్ ను అక్కడ రంగంలోకి దించింది. అప్పటి వరకు ఉన్న జోగి రమేష్ ను పక్కనపెట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు సీట్ ఇచ్చారు. దీనితో వసంత కృష్ణ ప్రసాద్ కూడా గట్టిగానే ఖర్చు పెట్టి దేవినేని ఉమా పై విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో ఉమా కచ్చితంగా గెలుస్తారని అంచనా వేస్తున్న సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపి కండువా కప్పుకోవడమే కాకుండా సీటు కూడా తెచ్చుకున్నారు. దీనితో దేవినేని ఉమా అక్కడి నుంచి కాస్త సైలెంట్ అయినట్లుగానే కనిపించింది.
అయితే గత ఏడాది వచ్చిన విజయవాడ వరదల సమయంలో ఆయన గట్టిగానే కష్టపడ్డారు. ముఖ్యంగా బుడమేరు వాగు గండి పూడ్చే విషయంలో దేవినేని ఉమా గట్టిగానే ఎఫర్ట్ పెట్టారు. ఇక కార్పొరేషన్ పదవుల్లో కూడా ఆయనకు ఏదో ఒక పదవిని చంద్రబాబు నాయుడు ఇస్తారని ఆశించారు. కానీ ఏ పదవి ఇప్పటివరకు దక్కలేదు. ఆర్టీసీ చైర్మన్ గా ఆయన పేరు ప్రముఖంగా వినపడింది. అలాగే కృష్ణ, గుంటూరు జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఆయన పేరు ప్రముఖంగా వినపడింది. కానీ ఆలపాటి రాజా పేరును ఖరారు చేసారు.
ఇక ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో ఇప్పుడైనా దేవినేని ఉమాకు సీటు వస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. వంగవీటి రాధకు దాదాపుగా ఎమ్మెల్సీ స్థానం ఖరారు అయిపోయింది. ఇక దేవినేని ఉమాకు ఇస్తారా.. లేదంటే మాజీ మంత్రి కే.ఎస్ జవహర్ ఇస్తారా అనేది మాత్రం స్పష్టత రావటం లేదు. అయితే పార్టీ అధిష్టానంలో చంద్రబాబు వద్ద ఆయనకు మంచి పేరు ఉంది. లోకేష్ తో విభేదాలు ఉన్నాయని.. అందుకే దేవినేని ఉమాకు పార్టీ అధిష్టానం ఏం న్యాయం చేయలేకపోతుందని అంటున్నారు.
ఇక కృష్ణాజిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీన పడటానికి కూడా దేవినేని ఉమా కారణమనే అభిప్రాయంలో కూడా పార్టీ అధిష్టానం ఉంది. కొంతమంది కీలక నేతలు పార్టీని వీడటానికి ఆయనే కారణమని పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. అందుకోసమే ఆయన పార్టీ కోసం కష్టపడినా.. పార్టీ అధిష్టానం ఆయన విషయంలో సానుకూలంగా లేదనే భావన వినపడుతోంది.