పవన్ కల్యాణ్ ఆలయాల పర్యటన వ్యక్తిగతమా ? మొక్కుల కోసమే దక్షిణాది యాత్ర చేస్తున్నారా ?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. రాజకీయాలను పక్కన పెట్టిన పవన్ కల్యాణ్...దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటిని వరుస బెట్టి దర్శించుకుంటున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. రాజకీయాలను పక్కన పెట్టిన పవన్ కల్యాణ్…దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటిని వరుస బెట్టి దర్శించుకుంటున్నారు. కుమారుడు అకీరా నందన్ ను వెంట బెట్టుకొని వెళ్లడంతో…మీడి ఫోకస్ మొత్తం పవన్ టూర్ పైనే ఉంది. ఈ నెల 13న కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రంలోని కుమారస్వామిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించుకుని…ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో ఉన్న అగస్త్య ధ్యాన పీఠ మందిరాన్ని సందర్శించారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న పవన్… సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. అంతకుముందు రోజు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఇవాళ మధురై జిల్లా అళగర్ కొండల్లో కొలువైన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారితో సెల్ఫీలు దిగారు. కొందరికి ఆర్థిక సాయం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…దేవాలయాలను దర్శించుకుంటున్నారు. కుమారుడు అకీరా నందన్ తో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వరుసగా గుళ్లకు వెళ్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ టూర్ పై రకరకాల చర్చ జరుగుతోంది.
హిందువు అని చెప్పుకోవడానికే పంచెకట్టుతో పర్యటిస్తున్నారని…ఇపుడే ఆయనకు దేవుళ్ళు ఎందుకు గుర్తొచ్చారని ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఖర్చులతోనే దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తున్నారా ? లేదంటే అధికారిక పర్యటన చేస్తున్నారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆడమన్నట్లు పవన్ ఆడుతున్నారని…సొంత అజెండా అంటూ ఏమీ లేదని అంటున్నారు. పవన్ ఆధ్యాత్మిక పర్యటన పూర్తిగా కాషాయ పార్టీ స్పాన్సర్డ్ అన్న విమర్శలు వస్తున్నాయి
ఎన్నికలకు ముందు నుంచి హిందుత్వ నినాదాన్ని ఎత్తుకున్నారు. వైసీపీ హయాంలో ఆలయాలపై జరిగిన దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమని అనేక సార్లు హెచ్చరించారు. అయితే దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన పూర్తిగా తన వ్యక్తిగత అంశమని స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధం లేదని పవన్ తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల నిమిత్తం…ఆరోగ్యం సహకరించకున్నా రావాల్సి వచ్చిందని వెల్లడించారు. వ్యక్తిగతంగా పర్యటన చేస్తుంటే…సెక్యూరిటీ ఎందుని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే ఆలయాలకు వెళితే…అది పర్సనల్ ఎందుకవుతుందని నిలదీస్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లకుండా ప్రభుత్వ వాహనాలు ఉపయోగించడం…సెక్యూరిటీ ఉండటంపై జనం మండిపడుతున్నారు.