Revanth Reddy: యువతకు పెద్దపీట వేస్తున్న రేవంత్.. సీనియర్లకు చెక్ పెట్టే వ్యూహమా ?
ఐతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా.. రేవంత్ యూత్ మంత్రం జపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో కొత్త నాయకులను ఎంకరేజ్ చేయడంతో పాటు.. సీనియర్ల ఎదుర్కొనేలా తనకంటూ ఓ స్ట్రాంగ్ టీమ్ నిర్మించుకోవాలన్న స్ట్రాటజీ కనిపిస్తోంది.
రాజకీయాలను యువత మార్చేస్తారో లేదో కానీ.. ఫలితాలను మార్చేయడం మాత్రం ఖాయం. ఒకరకంగా బీజేపీ ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం ఇది. ఇప్పుడు ఇదే ఫార్ములాను నమ్ముకునేందుకు, కలిసి నడిచేందుకు రేవంత్ సిద్ధం అవుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇప్పటికీ బలమైన కేడర్ ఉంది. నడిపించే నాయకుడు లేడు అంతే ! రేవంత్ పగ్గాలు అందుకున్న తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపించినా.. సీనియర్లు తీరుతో.. మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది పరిస్థితి. సీనియర్ల నుంచి రేవంత్‌కు ఎదురవుతున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి పరిణామాల మధ్య రేవంత యువత మంత్రం జపిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో 25శాతం టికెట్లను యువతకే కేటాయించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి ప్రపోజల్ కూడా పంపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. పార్టీ పదవులు, టికెట్ల విషయంలో ప్రతీసారి సీనియర్లకే పెద్దపీట వేయడం వల్ల.. పార్టీలోకి కొత్త నీరు రాకుండా అవుతోందని.. ఇప్పటినుంచి ట్రెండ్ మార్చాలని రేవంత్.. కాంగ్రెస్ హైకమాండ్‌కు విన్నవించినట్లు టాక్ ! పాదయాత్ర పేరుతో తెలంగాణలో దూసుకుపోతున్న రేవంత్.. ఇప్పటికే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న యువ నేతలతో భేటీలు కూడా నిర్వహించాలనే చర్చ జరుగుతోంది. కొందరికి టికెట్ కన్ఫార్మ్ అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. రేవంత్ ప్రపోజల్‌పై సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మాములుగానే పార్టీలో జూనియర్లు, సీనియర్లు అని రెండు బ్యాచ్‌లు ఉన్నాయ్. రెండు వర్గాల మధ్య జరిగిన యుద్ధం ఏంటో ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. డిగ్గీ దిగాల్సి వచ్చింది రంగంలోకి !
ఐతే ఇప్పుడు యువతకు పెద్దపీట అంటే సీనయర్లు కచ్చితంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయ్. ఐతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా.. రేవంత్ యూత్ మంత్రం జపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో కొత్త నాయకులను ఎంకరేజ్ చేయడంతో పాటు.. సీనియర్ల ఎదుర్కొనేలా తనకంటూ ఓ స్ట్రాంగ్ టీమ్ నిర్మించుకోవాలన్న స్ట్రాటజీ కనిపిస్తోంది. మరి రేవంత్ తీరుపై సీనియర్లు ఇకపై ఎలా రియాక్ట్ అవుతారో !