రేవంత్ ప్లాన్ మారుతోందా…? కాంగ్రెస్ కు షాక్ తప్పదా..?

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వేదికగా పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు మొదలయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 04:50 PMLast Updated on: Mar 10, 2025 | 4:50 PM

Is Revanths Plan Changing Isnt This A Shock For Congress

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వేదికగా పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా షాక్ ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు ఎప్పటి నుంచొ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే కేంద్ర మంత్రులను కలవకుండా వచ్చిన పరిస్థితి లేదు. ఏఐసిసి పెద్దలకంటే బీజేపీ నేతలకే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసి సందర్భంగా బయటికి వచ్చిన ఫోటోలు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. గత పదేళ్ళలో ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని ఇతర ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు గాని.. ఈ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే వారు కాదు. దీనిపై చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఎన్నోసార్లు విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది.

అలాంటిది రేవంత్ రెడ్డి పదేపదే వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డికి పరిస్థితులు అనుకూలంగా కనపడలేదు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం.. ఈ మధ్యకాలంలో సంచలనం అవుతుంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి బిజెపి నేతలతో స్నేహం చేయడం సంచలనంగా మారింది.

త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని కాస్త దూరం పెడుతుంది అనే వార్తలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సంచలనమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులను రేవంత్ రెడ్డికి అసలు సీరియస్ గా తీసుకుని విసిగిపోయినట్లు సమాచారం. సీనియర్ నేతలు ఎన్నికల ముందు కాస్త సహకరించినా.. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు తీసుకుని కూడా, తనకు సహకరించడం లేదు అనే కోపంలో రేవంత్ రెడ్డి ఉన్నారు.

అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపితోనే ఎక్కువగా స్నేహం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిజెపి నేతలతో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. దీనితో ఆయన కచ్చితంగా కమలం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.