వేలాది సమాధానాల కంటే మౌనమే గొప్పదా ? పెద్ద నోట్ల నిర్ణయాన్ని వ్యతిరేకించిన మన్మోహన్ సింగ్
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్...అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని...చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్…అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని…చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు. నిరుద్యోగం, అసంఘటిత రంగం..కకావికలం అయిదందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మెడీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం…దేశాన్ని సంక్షోభం పడేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మన్మోహన్ సింగ్ చెప్పిన పవర్ ఫుల్ కోట్స్
1. నా మౌనమే….వేలాది సమాధానాల కంటే గొప్పది
2. తన కలలను వదులుకున్న వాడు…ఓడిపోయిన వాడితో సమానం
3. విద్య తెలివితేటలను మాత్రమే పెంచదు…జీవితాన్ని కూడా నేర్పిస్తుంది
4. కష్టపడకపోతే డబ్బు రాదు..డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి
5. రాజకీయాలు చేసేటప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి. తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు
6. జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు బాగుంటాయి, మరికొన్ని రోజులు చెడుగా ఉంటాయి
మన్మోహన్ సింగ్ పై ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ వచ్చింది. ఇందులో మన్మోహన్ సింగ్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. ఆయన సన్నిహితుడు సంజయ్ బారు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా…ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీని తెరకెక్కించారు.
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీలో డైలాగ్స్
1. మహాభారతంలో రెండు కుటుంబాలు మాత్రేమే ఉండేవి. భారతదేశంలో ఒక్కటే ఉంది.
2. డాక్టర్ సాహెబ్‌ని ఎప్పుడు కుర్చీలో నుంచి దించుతారు. రాహుల్‌కి పాలాభిషేకం ఎప్పుడు చేస్తారు.
3. డాక్టర్ సాహెబ్ నాకు భీష్ముడిలా కనిపిస్తున్నాడు.ఎలాంటి భయం లేదు. కానీ ఫ్యామిలీ డ్రామాకు బలి అయ్యారు.
4. నాకు ఎలాంటి క్రెడిట్ అక్కర్లేదు. నా సొంత వ్యాపారాన్ని చూసుకుంటాను. ఎందుకంటే నాకు దేశమే ముఖ్యం.
5. 100 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు నడుపుతున్నారు. వారే దేశ కథను రాస్తారు.
6. పానిపట్ యుద్ధం కంటే అణు ఒప్పందం కోసం పోరాటం పెద్దది.