ఆర్మీ చీఫ్‌పై యుద్ధం ప్రకటించిన సైన్యం, పాకిస్తాన్ సైన్యంలో తిరుగుబాటు తప్పదా?
'పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది'.. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన సంచలన కామెంట్ ఇది. పాకిస్తాన్‌ను స్ట్రిక్ట్‌గా మార్చాలన్నారు.

‘పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది’.. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన సంచలన కామెంట్ ఇది. పాకిస్తాన్‌ను స్ట్రిక్ట్‌గా మార్చాలన్నారు. వేర్పాటువాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోడానికే అని చెప్పారు. పాలనను మెరుగుపరచాలని, పాలనలో అంతరాల వల్ల సైన్యం, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంత కాలం అంటూ ప్రశ్నించారు. తన వ్యాఖ్యల ద్వారా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారు. నిజం ఏంటంటే.. పాకిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆసిమ్ మునీరే. ఎందుకంటే, పాకిస్తాన్ ప్రధానిని కూడా శాసించేది ఆర్మీ అధినేతే. ఈ నిజం తెలుసు కాబట్టే ఆసిమ్ మునీర్‌పై ఆర్మీ తిరగబడుతోంది. ఔను.. మీరు విన్నది నిజమే.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌పై సైన్యం తిరగబడింది. పదవినుంచి దిగుతావా.. దించేయమంటావా? అంటూ సంచలన లేఖ వదిలింది. ఆ వివరాలు ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ వ్యవహారం ఇప్పటికీ పాక్ సైన్యాన్ని భయపెడుతూనే ఉంది. ఆ దాడిలో 200 మందికి పైగా పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినట్టు బీఎల్ఏ ప్రకటిస్తే.. 33 మంది బలూచ్ లిబరేషన్ ఫైటర్లను హత మార్చినట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక కాన్వాన్‌ని లక్ష్యంగా చేసుకుని మరోసారి బీఎల్ఏ భీకర దాడి చేసింది. ఈ దాడిలో 90 మంది సైనికులు మరణించినట్టు ప్రకటించింది. ఆ తర్వాత మరోసారి పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌ను టార్గెట్ చేసింది. కలాట్ టౌన్‌లోని హర్బొయి ప్రాంతంలో బీఎల్‌ఏ ఐఈడీ అమర్చింది. ఈ ఘటనలోనూ పలువురు సైనికులు ప్రాణాలు కోల్పాయారు. బీఎల్ఏ మాత్రమేకాదు.. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ కూడాపాక్ సైనికుల్ని లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే టీటీపీ అధినేత నూర్‌వలి మెహసూద్.. పాకిస్తాన్ సైన్యంపై
యుద్ధం ప్రకటించాడు. ఆపరేషన్ అల్-ఖండక్ ద్వారా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేయాలని టీటీపీ ఫైటర్లకు పిలుపునిచ్చాడు. దీంతో పాక్ సైనికుల ప్రాణాలకి గ్యారెంటీ లేకుండాపోయింది. కట్‌చేస్తే.. ఆర్మీ చీఫ్‌పై తిరబడాలని డిసైడ్ అయ్యారు. ఒక సంచలన లేఖతో ఆసిమ్ మునీర్‌కు డేంజర్ సిగ్నల్స్ పంపించారు.
జవాన్ మొదలు, కెప్టెన్, మేజర్, కల్నల్ ర్యాంకు అధికారులు తమ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు. ఆసిమ్ వైఫల్యాలను ఒక్కొక్కటిగా పేర్కొంటూ.. సుదీర్ఘ లేఖ రాశారు. ఆయన హయాంలో పాక్ సైన్యం పరిస్థితి 1971లకు వెళ్లిపోయిందని వాపోయారు. ఒకవేళ ఆసిమ్ రాజీనామా చేయకుంటే.. తామే చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని, సైన్యాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని హెచ్చరించారు. ఆ లేఖలో ఆసిమ్ మునీర్ తప్పులను ఒక్కొక్కటిగా వివరించారు. రాజకీయ అసమ్మతిని అణచివేయడం, జర్నలిస్టుల నోళ్లు మూయించడం, ప్రజాస్వామ్య శక్తులను అణచివేయడం ద్వారా సైన్యం ఖ్యాతిని ఆర్మీ చీఫ్ నాశనం చేశారని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్ తొలగింపు తర్వాత జరిగిన హింసాత్మక చర్య, 2024 ఫిబ్రవరి 8న ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ ఘటనలు పాక్ సైన్యం విశ్వసనీయతను దెబ్బతీసిన క్షణాలుగా హైలైట్ చేశారు. మునీర్ తన అధికారాన్ని కాపాడుకోడానికి దేశాన్ని ఆర్థిక వినాశనంవైపు నడిపి స్తున్నారని మండిపడ్డారు.
ఆర్థిక వ్యవస్థ శవంగా మారింది, అయినప్పటికీ మీరు ప్రధాన కార్యాలయంలో నియంతలా తిరు గుతూ, మేము ఆకలితో చనిపోతున్నప్పుడు మీ పదవీకాలాన్ని 2027 వరకూ పొడిగించారు. సైన్యంపై జనం ఆగ్రహానికి ఇదికూడా కారణం. దేశ పౌరులు సైనిక పోస్టులపై రాళ్లు రువ్వారు. పాకిస్తాన్ సైన్యాన్ని దాని సొంత భూమిపై అపరిచితుడిని చేశారు” అని లేఖలో రాశారు. అంతేకాదు, ఆర్మీ చీఫ్‌ను ప్రజల ఖర్చుతో విందు చేసుకుంటున్న ఫాసిస్ట్ మృగంతో పోల్చారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేయడాన్ని అవమానకరమైన క్షణంగా అభివర్ణించారు. “ఆ రోజే బలూచిస్తాన్‌ను కోల్పోయాం, గౌరవాన్నీ కోల్పోయాం అనీ దీనంతటికీ కారణం ఆసిమ్ మునీరే అని ఆరోపించారు. చివరగా ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ పదవికి రాజీనామా చేయకపోతే, సైన్యమే చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే తిరుగుబాట్లతో.. ప్రభుత్వాలనే మార్చిన చరిత్ర ఉన్న పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత తిరుగుబా టు మొదలైంది. ఇది చివరకు ఆసిమ్ మునీర్‌ను గద్దె దించడంతో పాటు దేశాన్ని మరోసారి తమ చేతిలోకి తీసుకునే వరకూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడే ఈ తిరుగుబాటు ఎందుకొచ్చినట్టు?
ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ ముందుకు ఓ సంచలన బిల్లు వచ్చింది. ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమ్మీ పనెట్టా ‘పాక్ డెమోక్రసీ యాక్ట్’ పేరిట దీనిని తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాగ్నిట్‌స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంట్‌బులిటీ యాక్ట్ కింద ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. ఇమ్రాన్‌ఖాయ్‌ను విడుదల చేయడంతో పాటు.. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ఆంక్షలు విధించాలని బిల్లులో డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని.. పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచేలా వీసాపై బ్యాన్ విధించాలన్నారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెల కొల్పి ఇమ్రాన్‌ను విడుదల చేయించాలని కోరారు. ఈ బిల్లు తర్వాతే పాకిస్తాన్ సైన్యంలో అంతర్గతంగా చర్చ మొదలైనట్టు కనిపిస్తోంది. మునీర్ ఆట కట్టిస్తేనే తమ తలరాతలు మారతాయని నమ్మింది. లేఖ ద్వారా హెచ్చరికలు పంపింది. ఇక మిగిలిందల్లా పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత యుద్ధం ఒక్కటే.