HCU కేసు వాదించిన లాయర్ ఈయనే ,జగన్ ఎంట్రీతో కేసు క్లోజ్ ?
HCUలో చెట్లు నరకడం వెంటనే ఆపాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో యూనివర్సిటీలో విద్యార్థులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోరాటంలో యూనివర్సిటీ విద్యార్థులు ఎంత కీలకంగా వ్యవహరించారో.

HCUలో చెట్లు నరకడం వెంటనే ఆపాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో యూనివర్సిటీలో విద్యార్థులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోరాటంలో యూనివర్సిటీ విద్యార్థులు ఎంత కీలకంగా వ్యవహరించారో.. ఓ వ్యక్తి కూడా అంతే కీలకంగా వ్యవహరించారు. ఆయనే వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద కేసు తీసుకున్నా.. దాంట్లో 90 పర్సెంట్ నిరంజన్ రెడ్డి ఇన్వాల్వ్‌మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అదీ ఆయన రేంజ్. ఆయన ఎవరో మీకు సింపుల్‌గా చెప్పాలంటే.. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ కేసులో బన్నీ తరఫున వాదించి ఒకే ఒక్క రోజులో బన్నీకి బెయిల్ తెప్పించింది ఈ లాయరే. సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి వర్సెస్ మహారాష్ట్ర కేసులో.. అర్నబ్‌కు బెయిల్ ఇప్పించింది కూడా నిరంజన్ రెడ్డే.
జగన్ మీద ఉన్న సీబీఐ కేసులో.. జగన్ తరఫున నిరంజన్ రెడ్డే వాదించారు. పార్టీ ఎంపీగా, లాయర్‌గా కాకుండా జగన్‌కు, మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. సింపుల్‌గా చెప్పాలంటే HCU ఇష్యూ ఆయన టేకప్ చేయడానికి జగన్, కేటీఆర్ కూడా ఓ కారణం. 1970 జూలై 23న తెలంగాణలోని నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో జన్మించారు నిరంజన్ రెడ్డి. ఈయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి, తల్లి విజయ లక్ష్మి. హైదరాబాద్‌లో హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పుణెలోని సింబయాసిస్ లా-కాలేజీలో LLB కంప్లీట్ చేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1994 నుండి సుప్రీం కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేపని చేసి, రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితులయ్యారు.
రీసెంట్‌గా ఓ వ్యక్తి యూపీలో 370 చెట్లను నరికేశాడు. అతనికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సుప్రీం కోర్టు.. చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే పెద్ద నేరమని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్‌ను ఎగ్జాంపుల్‌గా చెప్తూ HCU చెట్ల నరికివేత కేసును సుప్రీం ముందు ఉంచారు నిరంజన్ రెడ్డి. 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డీ ఫారెస్టేషన్‌ను కళ్లకు కట్టినట్టు సుప్రీం కోర్టుకు చూపించారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారంటూ తెలంగాణ చీఫ్ సెక్రెటరీ మీద సీరియస్ అయ్యింది సుప్రీం కోర్టు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, అప్పటి వరకూ నరికివేత ఆపాలంటూ ఏప్రిల్ 7కి విచారణ వాయిదా వేసింది. ఇలా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి న్యాయ సహాయాన్ని అందించి.. వాళ్లందరి విజయంలో కీలక పాత్ర పోషించారు నిరంజన్ రెడ్డి.