ఆ నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ? మట్టి బకాసురుడికి కటకటాలు తప్పవా ?
ఆయన మీడియాలోకి వస్తే బీప్ సౌండ్. నోరు విప్పితే కంపునకు కేరాఫ్ అడ్రస్. బూతులకు వెగటు పుట్టించే నాయకుడు. ఆ బూతులతోనే మంత్రి అయ్యాడు.

ఆయన మీడియాలోకి వస్తే బీప్ సౌండ్. నోరు విప్పితే కంపునకు కేరాఫ్ అడ్రస్. బూతులకు వెగటు పుట్టించే నాయకుడు. ఆ బూతులతోనే మంత్రి అయ్యాడు. అనతికాలంలోనే వందల కోట్లకు పడగలెత్తిన నాయకుడు. ఒకటా రెండా…అయన చేయని అవినీతి, అరాచకాలకు కొదువలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై బూతులతో రెచ్చిపోయాడు. సదరు మాజీ మంత్రి చేసిన అక్రమాలపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. కటకటాల్లోకి పంపడమే లక్ష్యంగా…పకడ్బందీగా కేసులు పెట్టాలని డిసైడయింది. ఇంతకీ ఆయనెవరు ? ఏ క్షణమైనా పోలీసుల నోటీసులిస్తారా ?
కొడాలి నాని…బూతుల మంత్రి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూతులంటే మొదట గుర్తుకొచ్చేది కొడాలి నాని ఆలియస్ కొడాలి వెంకటేశ్వరరావు. వైసీపీ హయాంలో కొడాలి నాని అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడు. పల్లెటూర్లు, మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారు ఉపయోగించని భాషను వాడాడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, దాదాపు మూడేళ్లు మంత్రిగా వెలగబెట్టాడు. కృష్ణా జిల్లాకి క్యాసినోను పరిచయం చేసిన ఘనుడు కూడా ఆయనే. ఇక అక్రమాలు, అరాచకాలలో…జిల్లాలో కొడాలి నానిని మించిన వారు లేరు. కబ్జాల నుంచి కాల్‌మనీ వరకు ఎవరైన తన తరువాతే అన్నట్లుగా కోట్లకు పడగలెత్తాడు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి…ఆ తర్వాత మాటమార్చిన వ్యక్తి. ఆ విషయాన్ని అడిగితే నీ అమ్మ మొగుడు అని బూతు పురాణం అందుకున్న మహానుబావుడు. ఎమ్మెల్యే, మంత్రిగా కొడాలి నాని చేసిన అక్రమాలపై కూటమి సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేసింది. ఆయన అవినీతి, అక్రమాలపై ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో గ్రావెల్ అనుమతులు పొంది బినామీలకు అప్పగించారు. కొండలన్నీ బోడిగుండ్లు చేసేశారు. ఇదీ తన నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలోది. పలు సంస్థలకు గ్రావెల్ రవాణా చేశారు. కోట్లు పోగేశారు. పోలవరం కాలువ కట్టలను మాయం చేశారు. పట్టణ పరిధిలో టిడ్కో ఇళ్లకు మట్టి దందాలో కోట్ల రూపాయలు కుమ్మేశారు. వక్ఫ్ బోర్డు భూముల్లో కొంత భాగం వ్యాపారులు కొన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి వారికి హక్కులు కల్పించి బదులుగా కోట్లు గుంజారు. ఓ స్థిరాస్థి వ్యాపారి అప్పును కోట్లలో చూపించి అధికారులతో ఒత్తిడి చేయించారు. ఆ వ్యాపారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై షాపింగ్ కాంప్లెక్సు స్వాధీనం చేసుకున్నారు. మంత్రిగా చేసినప్పుడు ఓ అధికారికి రెవెన్యూ శాఖ నుంచి బియ్యం శాఖకు డిప్యుటేషన్‌పై జిల్లాకు అప్పగించారు. ఆ జిల్లా ధాన్యం సాగులో ప్రసిద్ధి ఇంకేముంది ధాన్యం కొనుగోలు పేరుతో రెండేళ్లు దుచుకున్నారు. బదులుగా ఓ విలాసవంతమైన విల్లా కానుకగా ఇచ్చారు.
కొడాలి నాని ఎక్కడెక్కడ అవినీతి చేశాడు ? ఏ యే రంగాల్లో ఎంత దోచుకున్నాడు ? ఎన్ని కోట్లకు పడగలెత్తాడు ? వంటి అంశాలను పోలీసులు సేకరిస్తున్నారు. నటుడు పోసాని, బోరుగడ్డ అనిల్ మాదిరిగా…వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి బొక్కలోకి వేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లాలో దాదాపు 150 ఎకరాల ఇనాం భూములకే గాలం వేశారు. వస్తే 500 కోట్ల రూపాయల ఇనాం కొండ పోతే ఆయన భాషలో ఒక వెంట్రుక. ఆ భూముల్ని కొంతమందికి ఇనాం ఇచ్చినా… తర్వాత పట్టాలు చేయలేదు. కాలక్రమంలో చేతులు మారి దేవదాయ భూములుగా ఉన్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారితో కలిసి ఆక్రమణకు స్కెచ్ వేశారు. రెవెన్యూ శాఖ కూడా నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఆ ఐఏఎస్ ఇవి దేవదాయశాఖకు చెందిన భూములు కావని ఎన్‌వోసీ జారీ చేశారు. ఈ దస్త్రం దేవదాయ శాఖ కమిషనర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ క్లియరెన్స్ దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్‌లో పడింది. అప్పటికే కొడాలి నానికికోట్లు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారినా…ఇప్పటికీ ఆ భూములు ఆక్రమణదారుల కబ్జాలోనే ఉన్నాయి. ఇటీవల కంచెలు కూడా వేశారు. దీనిపై పోలీసులు ప్రముఖంగా ఫోకస్ పెట్టారు.