పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా గుండు చేయించుకోవడం వెనక అంత పెద్దకథ ఉందా..!
ప్రపంచంలో అన్నింటికంటే అమ్మ మనసు గొప్పది అని ఊరికే అనలేదు. ఎన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిన అమ్మకు సాటి రాదు అనేది మరోసారి నిజం చేసి చూపించారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా.

ప్రపంచంలో అన్నింటికంటే అమ్మ మనసు గొప్పది అని ఊరికే అనలేదు. ఎన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిన అమ్మకు సాటి రాదు అనేది మరోసారి నిజం చేసి చూపించారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈమె గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. మామూలుగా వార్తల్లో నిలవడానికి పెద్దగా ఇష్టపడని అన్న లెజినోవా.. తాజాగా చేసిన ఒక్క పనితో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇన్ని రోజులు కేవలం పవన్ కళ్యాణ్ భార్యగానే తెలిసిన ఈమె.. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అందరి ముందుకు వచ్చారు. అసలు విషయం ఏమిటంటే ఈమె తిరుమలలో తలనీలాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మూడు రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. తన బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుపతికి వస్తానని.. తలనీలాలు ఇస్తానని పవన్ భార్య మొక్కుకోవడం విశేషం. అన్నట్టుగానే తిరుమలకు వచ్చి.. చిన్ననాటి నుంచి క్రిస్టియానిటీని కూడా పక్కనపెట్టి తలనీలాలు సమర్పించింది.
తనకు ఆ వెంకన్న స్వామిపై ఉన్న నమ్మకాన్ని ప్రపంచానికి చూపించింది అన్న. అంతేకాదు తిరుమలలో అన్ని మతస్థులు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అది కూడా ఇచ్చి పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజీ ఇంకా పెంచింది అన్న లెజినోవా. అంతేకాదు తిరుమలలో అన్న ప్రసాదానికి కొడుకు పేరు మీద రూ.17 లక్షలు కూడా డొనేట్ చేసింది. ఈమె తలనీలాలు ఇవ్వడం రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను మరొక మెట్టు పైకి ఎక్కించింది. కూటమి ప్రభుత్వం గెలిచిన నాటి నుంచి సనాతన ధర్మం అంటూ హిందుత్వం గురించి చాలా పెద్ద యుద్ధమే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి మోడీ కూడా పవన్ సనాతన ధర్మం పట్ల చేస్తున్న పోరాటం చూసి ముచ్చట పడ్డాడు. కేంద్రంలో పవన్ కళ్యాణ్ మైలేజ్ పెరగడంలో ఈ సనాతన ధర్మం ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంది.
దాంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం నడిచింది. ఆ సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ జగన్ అన్యమతస్తుడు కావడంతో డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం తేల్చిచెప్పింది.. దానికి జగన్ ఈగో హర్ట్ అయింది.. నేను మాజీ ముఖ్యమంత్రిని.. నేనెందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అని జగన్ బాగా ఈగోకు తీసుకున్నాడు. ఈ విషయాన్ని కూడా హిందువులు దగ్గరగా పరిశీలించారు. తిరుమలలో ఉన్న ఆచారాన్నే కదా వాళ్లు చెప్పింది.. అందులో జగన్‌కు ఉన్న ఇబ్బంది ఏంటి అని అన్ని వర్గాల ప్రజలు ఫీల్ అయ్యారు. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమల వెళ్లారు.. అందులో పవన్ మూడో భార్య అన్నా లెజినోవా కుమార్తె కూడా తిరుమల రావడంతో.. పాపతో డిక్లరేషన్ ఇప్పించాడు పవన్. ఇప్పుడు అన్న లెజనోవా కొడుకు కోసం గుండు చేయించుకున్నారు. ఈ రెండు సంఘటనలతో పవన్ కళ్యాణ్ రియల్ హీరో అయిపోయాడు.