పవన్ హ*త్యకు కుట్ర ? సెక్యూరిటీ టీంలో నకిలీ పోలీస్
పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా ? రాజకీయంగా పవన్‌ను ఎదుర్కోలేని వాళ్లు ఆయనను అంతం చేయాలని చూస్తున్నారా ? కూటమి పవన్ అభిమానులను ఇప్పుడు టెన్షన్ పెడుతున్న ప్రశ్నలు ఇవే.
పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా ? రాజకీయంగా పవన్‌ను ఎదుర్కోలేని వాళ్లు ఆయనను అంతం చేయాలని చూస్తున్నారా ? కూటమి పవన్ అభిమానులను ఇప్పుడు టెన్షన్ పెడుతున్న ప్రశ్నలు ఇవే. పవన్ కళ్యాణ్ మన్యం పర్యటలో ఉన్న సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో ఓ నకిలీ పోలీస్ కనిపించడం ఇప్పుడు ఇన్ని అనుమానాలకు దారి తీస్తోంది. రీసెంట్‌గా పార్వతీపురం మణ్యం జిల్లాలో డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానికులను ఆయన కలుస్తున్న సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో ఓ నకిలీ పోలీస్ ఉండటాన్ని మిగతా సిబ్బంది గుర్తించారు. కానీ అతన్ని పట్టుకునేలోపే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. నిందితుడు విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్యప్రకాష్‌గా గుర్తించారు. గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్‌లో ఉన్నానని స్థానికులను నమ్మించాడు.
పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పాడు. తన సొంత కార్ ఇంటి దగ్గరే విడిచి పెట్టి వేరే కార్లో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన సూర్య ప్రకాష్‌ను.. విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్య ప్రకాష్ ఎస్కేప్ అయ్యేందుకు స్థానిక ఏఆర్ కానిస్టేబుల్ సహకరించాడు. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి దగ్గరే విడిచి పెట్టిన పారిపోయేందుకు ప్రయత్నించాడు సూర్య ప్రకాష్. అతడు ఐపీఎస్ అధికారా కాదా అనే వివరాలను విజయనగరం పోలీసులు సేకరిస్తున్నారు. ఇక, సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్‌గా పని చేశాడు. అతడు పవన్ మీద అభిమానంతో వచ్చాడా లేక ఎవరైనా దాడి చేయమని పంపించారా అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కల్యాణ్ చుట్టూ నకిలీ ఐపీఎస్ తిరగడంపై విచారణకు ఆదేశించారు. పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాణి ఉందన్న నేపథ్యంలోనే కేంద్రం ఆయనకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. అలాంటిది ఆ సెక్యూరిటీ సిబ్బందిలో వేరే వ్యక్తి కనిపించడంపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు.