మరో మాజీ మంత్రికి ఎర్త్.. రజనీ తర్వాత రెడ్డి గారే
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రుల వ్యవహారాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన మాజీ మంత్రులు కొంతమందికి బెండు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రుల వ్యవహారాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన మాజీ మంత్రులు కొంతమందికి బెండు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్, పేర్ని నానీ, కొడాలి నాని, విడదల రజనీపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టింది.
తాజాగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనితో అలెర్ట్ అయిన గోవర్ధన్ రెడ్డి.. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యంతర ఉత్తర్వులను ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తనపై చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరగా దానిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనితో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లపాటు ఆయన గట్టిగానే మాట్లాడారు. ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మాజీ మంత్రులపై ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో కాకాని.. తనపై ఉన్న కేసులు వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.