Ponguleti Srinivas Reddy : పొంగులేటిపై ఐటీ రెయిడ్స్.. రెండు రోజుల ముందే లీక్..?

అనుకున్నట్టే అయింది.. తనపై ఐటీ రెయిడ్స్ జరగబోతున్నాయని.. రెండు రోజుల క్రితమే చెప్పారు.. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇవాళ తెల్లవారుజామున నాలుగింటికే పొంగులేటి ఇంటి తలుపులు కొట్టారు Income Tax అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 12:47 PMLast Updated on: Nov 09, 2023 | 12:47 PM

It Raids On Ponguleti Leaked Two Days Ago

అనుకున్నట్టే అయింది.. తనపై ఐటీ రెయిడ్స్ జరగబోతున్నాయని.. రెండు రోజుల క్రితమే చెప్పారు.. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇవాళ తెల్లవారుజామున నాలుగింటికే పొంగులేటి ఇంటి తలుపులు కొట్టారు Income Tax అధికారులు. ఆయన ఇల్లు, ఆఫీసులు, కంపెనీలు, సంస్థలపై ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఈ ఐటీ సోదాలపై మండిపడ్డారు pcc చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.

Telangana assembly elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పొంగులేటి నివాసంలో ఈడీ, ఐటీ విస్తృత తనిఖీలు..

తెలంగాణ (TELANGANA ) లో ఈ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరుగుతున్నాయి. అందుకోసం అన్ని పార్టీల అభ్యర్థులు బిజీ బిజీగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇదే టైమ్ లో income tax అధికారులు కూడా అభ్యర్థుల ఇళ్ళపై బిజీ బిజీగా దాడులు చేస్తున్నారు. లేటెస్ట్ గా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు ఐటీ ఆఫీసర్లు. తనపై ఐటీ రెయిడ్స్ జరుగుతాయనీ. అందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని.. పొంగులేటి రెండు రోజుల క్రితమే చెప్పారు. ఆయన అన్నట్టే ఐటీ ఆఫీసర్లు ఇవాళ రెయిడ్స్ మొదలుపెట్టారు. పొంగులేటి నివాసం ఉండే ఖమ్మంతో పాటు హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ రెయిడ్స్ జరుగుతున్నాయి. అధికారులు 8 వాహనాల్లో వచ్చారని చెబుతున్నారు. అన్నిచోట్లా తెల్లవారు జాము నుంచే సోదాలు షురూ చేశారు ఐటీ అధికారులు.

TDP, Jana Sena, JAC Meeting : నేడు టీడీపీ – జనసేన జేఏసీ రెండో సమావేశం.. మేనిఫెస్టో రూపకల్పనపై క్లారిటీ వచ్చే అవకాశం..!

పొంగులేటి ఇవాళ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. ఇంతలోనే ఐటీ సోదాలు చేపట్టడంపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. నామినేషన్లు వేసే హడావిడిలో ఉంటే.. హౌస్ అరెస్ట్ చేసినట్టుగా పొంగులేటి, ఆయన కుటుంబాన్ని ఎటూ కదలనీయడం లేదని మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ఇంటికి చేరుకుంటున్నారు.

గత వారంలో మహేశ్వరం (Maheshwaram) కాంగ్రెస్ (Congress) అభ్యర్థి తరువాత బడంగ్ పేట మేయర్.. ఇలా ఎన్నికల టైమ్ లో.. కాంగ్రెస్ లీడర్లపైనే ఐటీ దాడులు జరుగుతుండటంపై ఆ పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. ఓటమి భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తమ అభ్యర్థులపై కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు మల్లు భట్టి విక్రమార్క.