Kanhayalal Ashok Gehlots : కన్హయ్యలాల్‌ను చంపింది బీజేపీ వాళ్లే.. అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణ..
టైలర్ కన్హయ్య లాల్ హత్య.. దేశాన్ని కుదిపేసిన ఘటన. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడని.. కన్హయ్య లాల్ అనే టైలర్‌ను కొందరు వ్యక్తులు చంపేశారు. వీడియో తీసి మరీ తల నరికేశారు. ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనంగా మారింది.
టైలర్ కన్హయ్య లాల్ (Kanhayalal ) హత్య.. దేశాన్ని కుదిపేసిన ఘటన. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడని.. కన్హయ్య లాల్ అనే టైలర్‌ను కొందరు వ్యక్తులు చంపేశారు. వీడియో తీసి మరీ తల నరికేశారు. ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనంగా మారింది. ఆ ఘటన గురించి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlots) సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్హయ్య లాల్‌ను చంపింది బీజేపీ వాళ్లు అంటూ ఆరోపించారు. కన్హయ్య లాల్ హంతకులను బీజేపీ నేతలు విడిపించుకుని వెళ్లారంటూ చెప్పారు. ఈ హత్య జరగడానికి కొన్ని రోజులు మందు కూడా ఆ నేరస్థులు వేరే కేసులో జైలుకు వెళ్లారని.. ఆ కేసు నుంచి వాళ్లను బీజేపీ నేతలు విడింపించారిన చెప్పారు. వాళ్లు బయటికి వచ్చిన కొన్ని రోజులకే మళ్లీ కన్హయ్యలాల్‌ను చంపేశారంటూ చెప్పారు.
ZP Chairman Tula Uma : బీజేపీకి భారీ షాక్.. బీఆర్ఎస్ లో చేరుతున్న మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ..
ఇలాంటి ఘటనలను బీజేపీ ప్రోత్సహిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే అశోక్ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పి కొడుతున్నారు. హంతకులకు కొమ్ము కాయాల్సిన అవసరం తమకు లేదని చెబుతున్నారు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని తామెందుకు చంపిస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందంటూ చెప్తున్నారు. అశోక్ గెహ్లాట్ కామెంట్స్ ఇప్పుడు కామన్ పీపుల్‌ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నుపుర్ శర్మ బీజేపీ నేత. హిందు వాది. అలాంటిది ఆవిడకు మద్దతు తెలిపిన వ్యక్తినిక బీజేపీ నేతలు ఎందుకు హత్య చేయిస్తారు అనేది ప్రతీ ఒక్కరికి వస్తున్న డౌట్. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఏకంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా చేశారు ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి.