అమెరికాకు ఇప్పుడు వెళ్లకపోతేనే బెటర్
ఇంజనీరింగ్ చేసిన చాలామంది విద్యార్థుల కల అమెరికా.. MS పేరిట విమానం ఎక్కడం.. అమెరికాలో MS పూర్తి చేసేలోగా అక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం.

ఇంజనీరింగ్ చేసిన చాలామంది విద్యార్థుల కల అమెరికా.. MS పేరిట విమానం ఎక్కడం.. అమెరికాలో MS పూర్తి చేసేలోగా అక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం. ఇవన్నీ యువతలో కామన్ గా ఉండే డ్రీమ్స్. కానీ ఇప్పుడు ఈ కల చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణం అవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే హెచ్-1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4 లక్షల 79 వేల 953.. గత ఏడాదితో పోలిస్తే ఇది 38.6 శాతం తక్కువ. ప్రతీ ఏటా హెచ్-1B వీసా కోసం భారత్ నుంచే ఎక్కువ శాతం దరఖాస్తులు వస్తూ ఉంటాయి.
మొత్తంగా వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్లే. ట్రంప్ 2.0 ప్రారంభం కావడానికి ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాలలో హైదరాబాద్ టాప్ 3 లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హెచ్-1B వీసాల కోసం గతంలో కనిపించిన పోటీ ఇప్పుడు అసలు లేని లేదంటున్నాయి పలు కన్సల్టెన్సీలు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారడం హెచ్-1B వీసాల గడువు భారీగా పెంచడం, దరఖాస్తుల వడపోతను కఠిన తరం చేయడం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడటం వంటి పరిణామాలే దీనికి కారణమని చెబుతున్నారు. ఏదో ఒక రకంగా అమెరికాకు వెళ్లి బాధపడడం కంటే కొంతకాలం ఇండియాలోనే వేచి ఉండటం బెటర్ అనే ఆలోచనలో చాలామంది యువత ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా తో పాటు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు భారీగానే ఉన్నాయి.
ఇది కూడా అమెరికన్ వీసాలకు ఇండియన్ దరఖాస్తులు తగ్గడానికి ఒక కారణం డ్రాప్ బాక్స్ నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పులు కూడా వీసాలు రెన్యువల్ చేసుకునే వాళ్లకు ఇబ్బందికరంగా మారాయట. కొత్త నిబంధనల ప్రకారం గత 12 నెలల్లో గడుగు ముగిసిన వీసాలకు మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఈ లిమిట్ గతంలో 48 నెలల వరకు ఉండేది. ఒక పాస్‌పోర్ట్‌తో ఒక వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని నిబంధన కూడా దరఖాస్తుల తగ్గుదలకు కారణమైంది. గతంలో కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు రెండు మూడు సంవత్సరాలు అనుభవం ఉంటే చాలు హెచ్-1B వీసాలు ఇచ్చి అమెరికాకు పంపేవాళ్లు. ఇప్పుడు పదేళ్ల అనుభవం ఉన్నా వాళ్లని అమెరికా పంపేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.