Italy: చైనాకు షాకివ్వనున్న ఇటలీ.. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన!

చైనా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) నుంచి తప్పుకోనున్నట్లు ఇటలీ వెల్లడిచింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జియోర్జియగా మెలోని ఆదివారం చైనా ప్రతినిధి లి క్వియాంగ్‌కు సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 10, 2023 | 04:41 PMLast Updated on: Sep 10, 2023 | 4:41 PM

Italy Planning To Exit Chinas Belt And Road Initiative

Italy: జీ20 సదస్సు వేదికగా చైనాకు షాకిచ్చింది ఇటలీ. చైనా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) నుంచి తప్పుకోనున్నట్లు ఇటలీ వెల్లడిచింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జియోర్జియగా మెలోని ఆదివారం చైనా ప్రతినిధి లి క్వియాంగ్‌కు సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ఇద్దరూ జీ20 సదస్సు సందర్భంగా భేటీ అయ్యారు. చైనా, ఇటలీ సంబంధాలపై చర్చించారు. బీఆర్ఐ నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్లు జార్జియా తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తమ దేశానికి ఎలాంటి లాభం లేదని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చినప్పటికీ, చైనాతో సత్సంబంధాలను కొనసాగిస్తామని ఆమె అన్నారు. చైనా రూపొందిస్తున్న బీఆర్ఐ ప్రాజెక్టులో 2019లో ఇటలీ భాగస్వామిగా చేరింది. ఈ ప్రాజెక్టు వల్ల తాము ఊహించిన ఫలితాలు సాధించడం లేదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇటీవలై చైనాకు ఇటలీ తేల్చిచెప్పింది.

ఇలా ఇటలీ సహా వివిధ దేశాలకు ప్రాజెక్టుపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీనిపై వచ్చే నెలలో బీజింగ్‌లో ఒక భారీ సమావేశం నిర్వహించేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఐ నుంచి వైదొలిగేందుకు డిసెంబర్‌‌లోపు నిర్ణయం తీసుకుంటామని గతంలో జార్జియఆ వెల్లడించినప్పటికీ.. తాజాగా దీనిపై ఒక నిర్ణయానికొచ్చేశారు. పైగా ఇటలీ జీ7 సభ్య దేశమేమీ కాదు. అంతేకాకుండా.. చైనాతో బలమైన వాణిజ్య సంబంధాలు కూడా లేవు. చైనా ప్రాజెక్టులో సభ్యత్వం కలిగిన ఐకైన పాశ్చాత్య దేశం కూడా ఇటలీనే. ఇప్పుడు ఈ దేశం బీఆర్ఐ నుంచి వైదొలిగితే.. చైనాకు ప్రాజెక్టు మరింత భారంగా మారుతుంది.