తిరుమలకు జగన్, అలా అయితేనే అనుమతి…?
మాజీ సిఎం వైఎస్ జగన్ నేడు తిరుమల వెళ్లనున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునే జగన్ కచ్చితంగా డిక్లరేషన్ కచ్చితంగా తీసుకోవాలని కూటమి సభ్యులతో పాటు సాధు పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మాజీ సిఎం వైఎస్ జగన్ నేడు తిరుమల వెళ్లనున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునే జగన్ కచ్చితంగా డిక్లరేషన్ కచ్చితంగా తీసుకోవాలని కూటమి సభ్యులతో పాటు సాధు పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక జగన్ కచ్చితంగా డిక్లరేషన్ అడుగుతామని టీటీడీ అధికారులు అంటున్నారు. క్యూ కాంప్లెక్స్ లోని 17వ కంపార్ట్ మెంటు లో డిక్లరేషన్ విభాగము ఉంది.
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత బెంగుళూరు వెళ్ళనున్నారు జగన్. ఇక వైసీపీ శ్రేణులు ఎవరూ రావద్దని జగన్ కోరారు. ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుంటా అంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక తిరుమలలో వీఐపీల దర్శనం కొనసాగుతోంది. జగన్ పర్యటన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్ పర్యటన ఉంటుంది. అక్టోబర్ 1-3వరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండననునది. బ్రహ్మోత్సవాల మొదటి రోజున పట్టు వ్రస్తాల సమర్పణకు సియం చంద్రబాబు నాయుడు రానున్నారు.