Chandrababu: చంద్రబాబు గెస్ట్ హౌజ్‌ను ఎటాచ్ చేసిన జగన్ సర్కార్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాకిచ్చింది ఏపీ సీఐడీ. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌజ్‌ను అటాచ్ చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో లింగమనేన రమేష్‌కు హెల్స్ చేసి.. దానికి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలున్నాయి. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది.
తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో ఏపీ ప్రభుత్వం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది.