వంశీపై జగన్.. స్పెషల్ లవ్.. థర్డ్ డిగ్రీ భయమా..?
సాధారణంగా వైయస్ జగన్ మనస్తత్వం చూసినవాళ్లు.. ఆయన ఎవరికీ పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు అనే ఒపీనియన్ లో ఉంటారు. జగన్ కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు.

సాధారణంగా వైయస్ జగన్ మనస్తత్వం చూసినవాళ్లు.. ఆయన ఎవరికీ పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు అనే ఒపీనియన్ లో ఉంటారు. జగన్ కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. తనకోసం అండగా నిలబడిన వాళ్ళను కూడా ఆయన పక్కన పెట్టేస్తూ ఉంటారనేది ప్రధాన ఆరోపణ. అది కుటుంబ సభ్యులైనా.. ఎవరైనా సరే అతీతం కాదు. అలాంటిది జగన్ ఈమధ్య కొంతమంది నేతలకు కాస్త ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా కొంతమందిని కాపాడుకునేందుకు కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.
అందులో ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో జగన్ చూపిస్తున్న ప్రేమ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. సాధారణంగా వైసీపీలో ఎవరైనా నాయకులు అరెస్టయితే జగన్ నుంచి స్పందన ఉండటం లేదనేది ఎక్కువగా వినపడుతున్నది. అయితే వల్లభనేని వంశీ విషయంలో మాత్రం ఇది కాస్త డిఫరెంట్ గా జరుగుతోంది. వంశి అరెస్ట్ అయిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్ జిల్లా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. ఇక ఆ తర్వాత వైసిపి నేతలు కూడా పదేపదే జైలు వద్దకు వెళుతున్నారు.
జగన్ వెళ్లిన రెండు రోజుల తర్వాత కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించి వచ్చారు. ఇక మరోసారి మంగళవారం కూడా వైసీపీ నేతలు జిల్లా జైలు వద్దకు వెళ్లాలని జగన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బాపట్ల మాజీ ఎంపీ.. నందిగం సురేశ్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు అరెస్టు అయితే వైసీపీ నుంచి ఈ స్థాయిలో అయితే కచ్చితంగా స్పందన లేదని చెప్పాలి. వాళ్ళిద్దరిని పరామర్శించడానికి జగన్ వెళ్లారు.
కానీ ఆ తర్వాత నేతలు ఎవరూ పెద్దగా రియాక్ట్ అవలేదు. జైలుకు వెళ్లి వాళ్లను పరామర్శించే ప్రయత్నం చేయలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు రెండు నెలలకు పైగా నెల్లూరు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఒకటి రెండుసార్లు వెళ్లారు. అది కూడా జగన్ వచ్చిన సమయంలో ఒకసారి.. ఆ తర్వాత మరో 20 రోజుల తర్వాత వెళ్లారు. కానీ వల్లభనేని వంశీ విషయంలో మాత్రం వైసిపి నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఇప్పుడు ప్రధానంగా వినపడుతోంది.
పదేపదే జైలుకు వెళ్లడం వెనక కారణం ఏంటి అనేది అర్థం కాకపోయినా.. వంశీని ఏమైనా టార్చర్ చేస్తున్నారా అనే విషయంలో వైసీపీ కంగారుపడుతుంది. ఇక వంశీ ఏదైనా విషయాలు చెప్తారా అనే దానిపై కూడా వైసిపి అధిష్టానం లో ఆందోళనలో ఉన్నట్టు టిడిపి నేతలు కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వైసిపి నేతలను అరెస్టు చేస్తే ఎక్కువగా రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. కానీ వంశీని మాత్రం విజయవాడలోనే ఉంచారు. ఆయన పై ఇప్పటికే పలు కేసులను కూడా బయటకు తీస్తున్నారు. మరి ఈ సమయంలో వైసీపీ అధిష్టానం ఎందుకు వంశీ పై అంతా స్పెషల్ లవ్ చూపిస్తుంది అనేది అర్థం కావటం లేదు.