మళ్ళీ బెంగళూరుకు జగన్, అందుకేనా…?

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మరోసారి బెంగళూరు వెళ్ళారు. సాధారణంగా శుక్రవారం సాయంత్రం బెంగళూరు వెళ్ళే జగన్ ఈసారి ఒక రోజు ముందే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన మంగళవారం తాడేపల్లి వచ్చే అవకాశం ఉంది. 15 వ సారి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరు వెళ్ళారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2024 | 01:06 PMLast Updated on: Oct 25, 2024 | 1:06 PM

Jagan To Bangalore Again Is That Why

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మరోసారి బెంగళూరు వెళ్ళారు. సాధారణంగా శుక్రవారం సాయంత్రం బెంగళూరు వెళ్ళే జగన్ ఈసారి ఒక రోజు ముందే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన మంగళవారం తాడేపల్లి వచ్చే అవకాశం ఉంది. 15 వ సారి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరు వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు జగన్ వెళ్ళడం ఏమో గాని ఈసారి వెళ్ళడం మాత్రం రాజకీయ వర్గాల్లో కచ్చితంగా సంచలనం అవుతోంది. ఏపీలో కంటే తన కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

వీటిని సాధారణ అంశంగా జగన్ తేల్చేసి మాట్లాడుతున్నా జగన్ పై మాత్రం ఒత్తిడి తీవ్రంగానే ఉందనే విషయం అర్ధమవుతోంది. ఇది జగన్ బెయిల్ పై కూడా ప్రభావం చూపే విషయంగా కనపడుతోంది. అందుకే జగన్ ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బెంగళూరులో జగన్ గత వారం, ఈ వారం న్యాయ నిపుణులతో భేటీ కోసమే బెంగళూరులో ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఆస్తుల విషయంలో షర్మిల పోరాటాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మరిన్ని కేసులు వేసి ఆమెపై ఎలా ఒత్తిడి పెంచాలి అనే దానిపై జగన్ ఫోకస్ చేస్తున్నారు.

అదే విధంగా ఆమెను గురించి వైసీపీ సోషల్ మీడియా ఏ విషయాలు బయటపెట్టాలి అనే దానిపై కూడా జగన్ దృష్టి సారించినట్టు సమాచారం. ఇక్కడి నుంచి షర్మిల పోరాటం కచ్చితంగా గట్టిగా, తీవ్రంగా ఉంటుంది. అందుకే జగన్ పక్కా ప్లాన్ గీసుకుని అడుగులు వేస్తున్నారు. అవసరమైతే షర్మిల గురించి కుటుంబ సభ్యులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయించాలని కూడా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మరో మూడు పిటీషన్ లు ఆయన ఎన్సీఎల్టీ కోర్ట్ లో వేయనున్నారు.