Relief to Pavan : పిఠాపురంకు వెళ్ళని జగన్.. పవన్ కల్యాణ్ కి రిలీఫ్
ఏపీలోని పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం ఫైనల్ టచ్ గా ఈనెల 10న పిఠాపురంలో జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించింది.
ఏపీలోని పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం ఫైనల్ టచ్ గా ఈనెల 10న పిఠాపురంలో జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించింది. కానీ అది రద్దవడంతో… పవన్ కల్యాణ్ రోడ్ షో చేసుకోడానికి అనుమతి లభించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఊరట దక్కింది. పిఠాపురంలో రోడ్ షో చేసుకోడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఈనెల 10 నాడు రోడ్ షో చేసుకోడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ గతంలోనే రిటర్నింగ్ అధికారికి జనసేన వినతిపత్రం ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా 10 నాడు పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వైసీపీ సభ, జనసేన రోడ్ షో ఒకే రోజు జరిగితే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. చివరకు వైసీపీ సభ వాయిదా వేసినట్టు సమాచారం రావడంతో…జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 10 నాడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పదింటి దాకా జనసేన రోడ్ షో నిర్వహించుకోవచ్చు. అయితే పవన్ కల్యాణ్ కు మద్దతుగా 10 లేదా 11 తేదీల్లో మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంకు వస్తారని సమాచారం. పవన్ కల్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి ఇప్పటికే స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. 10న జనసేన నిర్వహించే రోడ్ షోలో మెగాస్టార్ పాల్గొంటారా… లేదంటే 11న ప్రచారానికి వస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.