వర్మకు జగన్ 2 కోట్ల గిఫ్ట్… జీవీ రెడ్డి సంచలనం
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ 2 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించింది అంటూ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ 2 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించింది అంటూ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. నేడు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన… వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తాన్ని దర్శకుడు రాంగౌపాల్ వర్మకు చెల్లించారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా 1 వ్యూవ్ కు 11 వేలు చొప్పున ఆర్జీవీ సంస్థకు అప్పటి అధికారులు పేమెంట్ ఇచ్చారని అన్నారు.
18 లక్షలు వ్యూస్ వస్తే …2 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఏకంగా 2.10 కోట్లు రాంగోపాల్ వర్మకు అక్రమంగా చెల్లించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎపీఎస్ఎఫ్ఎల్ కు 1262 కోట్లు అప్పు చేశారని ఆయన మండిపడ్డారు. తెదేపా హయాంలో 3513 కోట్లు పెట్టుబడి పెట్టి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెట్టి 10 లక్షల కనెక్షన్లు పెంచామని అన్నారు.