రోజాకు జగన్ షాక్.. పార్టీలో చేరుతున్న కీలక యువ నేత
మాజీ మంత్రి ఆర్కే రోజాకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇవ్వనున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. నియోజకవర్గంలో రోజాను పక్కన పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది.

మాజీ మంత్రి ఆర్కే రోజాకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇవ్వనున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. నియోజకవర్గంలో రోజాను పక్కన పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. 2024 ఎన్నికలకు ముందు నగిరి నియోజకవర్గంలో విభేదాలు బయటపడ్డాయి. ఆర్కే రోజాను ఓడించడానికి అక్కడ పలువురు నేతలు సిద్ధమయ్యారు. ఇక నియోజకవర్గంలో రోజా ఓడిపోవడానికి కూడా ఆ నేతలే కారణమనే అభిప్రాయం కూడా ఉంది. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కూడా రోజాకు విభేదాలు ఉన్నాయి.
రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆమెను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇబ్బందులు పెట్టారనే అభిప్రాయం అప్పట్లో గట్టిగానే వినబడింది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రోజా అప్పుడప్పుడు మాత్రమే మీడియాలో కనపడుతున్నారు. పెద్దగా ఆమెకు వైసిపి అనుకూల మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అటు వైసీపీ అధిష్టానం కూడా ఆమెను పక్కన పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది.
రానున్న రోజుల్లో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీష్ నగిరి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చేపట్టే అవకాశం కనబడుతోంది. ఈ నెల 12న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన చేరునున్నారు. గత నెల మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా.. జగదీష్ కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించినట్లు వార్తలు వచ్చాయి. గాలి జగదీష్ కు నియోజకవర్గం లో సౌమ్యుడిగా పేరు ఉంది. అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఆయన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కు మంచి పేరు ఉంది.
ఇక వైసిపి నేతలు కూడా ఆయనను గురువుగా భావిస్తూ ఉంటారు. దీనితో గాలి జగదీష్ ఇప్పుడు వైసీపీలో చేరి నగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే మార్గం సుగుమం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి గత నెల గాలి జగదీష్ వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంతో అధికారికంగా పార్టీలో చేరేందుకు కుదరలేదు. ఇక జగన్ పర్యటన ముగించుకుని రావడంతో ఈ నెల 12న ఆ పార్టీలో జాయిన్ అయ్యేందుకు గాలి జగదీష్ సిద్ధమవుతున్నారు.
ముందుగా హడావుడి లేకుండా పార్టీలో చేరాలని అధిష్టానం చెప్పడంతో, నగిరి నియోజకవర్గంలో తన అనుచరులతో తిరుపతిలో సమావేశం జరిపి దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు జగదీష్. నగరి నియోజకవర్గంలో రోజా ప్రస్తుతం కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన వస్తే తనకు ఇబ్బంది అని భావించిన రోజా.. అధిష్టానం వద్ద ఇప్పటికే జగదీష్ ను పార్టీలోకి తీసుకోవద్దని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.. వాస్తవానికి ముందు ఈనెల 19న గాలి జగదీష్ పార్టీలో చేరే విధంగా అడుగులు వేశారు.
అయితే అనవసరంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆలస్యం చేయవద్దని.. జగదీష్ కు అధిష్టానం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన సోదరుడు గాలి భాను ప్రకాష్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి నగరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. అలాంటిది ఆయన సొంత తమ్ముడు వైసీపీలో చేరాలి అనుకోవడం సంచలనంగా మారింది. ఇక టిడిపిలో గాలి భాను ప్రకాష్ నాయకత్వాన్ని ఆ పార్టీకి క్యాడర్ ఇష్టపడటం లేదు. జగదీష్ కు బాధ్యతలు ఇవ్వాలని అప్పట్లో కొంతమంది టిడిపి నేతలు చంద్రబాబును కోరారు.
అయితే చంద్రబాబు మాత్రం ఆ విషయంలో ఆసక్తి చూపించలేదు. ఇక వైసీపీ క్యాడర్ నియోజకవర్గంలో బలంగానే ఉంది. అయితే వారిలో కొంతమంది రోజా నాయకత్వాన్ని ఇష్టపడటం లేదు. ఇప్పుడు గాలి జగదీష్ ఆ పార్టీలో చేరితే మాత్రం, కచ్చితంగా పరిస్థితి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనితో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
వాస్తవానికి తన అన్న భాను ప్రకాష్ కంటే గాలి జగదీష్ రాజకీయాల్లో ముందు అడుగుపెట్టినాన సీటు తెచ్చుకోవడం మాత్రం ఫెయిల్ అయ్యారు. మరి జగదీష్ పార్టీలో చేరడంతో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఇక ఈ విషయంలో టిడిపి అధిష్టానం కూడా సైలెంట్ గానే ఉంటుంది. గాలి జగదీష్ పార్టీ మారుతున్న విషయం తెలిసిన సరే ఆ పార్టీ అధిష్టానం పెద్దగా ఆపే ప్రయత్నం చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య యుద్ధం జరగటం ఖాయంగా కనపడుతుంది.